సభ్యత్వ నమోదును ఉధృతం చేయాలి


Sun,July 14, 2019 02:07 AM

ఐనవోలు జూలై 13: గ్రామాల్లోని ప్రతీ కార్యకర్త టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఉధృతం చేయాలని జెడ్పీ వైస్ చైర్మన్ గజ్జెల్లి శ్రీరాములు, ఎంపీపీ మార్నేని మధుమతి రవీందర్‌రావు అన్నారు. శనివారం మండలంలోని రాంనగర్‌లో టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మునిగాల సంపత్‌కుమార్ అధ్యక్షతన నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో వారు పాల్గొని ఇంటింటికి తిరుగుతూ పలువురికి సభ్యత్వాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పార్టీ సభ్యత్వాన్ని తీసుకోవడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ రాజ్‌కుమార్, సర్పంచులు బోయినపల్లి శ్రీనివాసరావు, యాకర మంజుల యాదగిరి, ఎంపీటీసీ దామెర అనూష అనిల్, మాజీ ఎంపీటీసీ పుల్యాల జ్యోతి, టీఆర్‌ఎస్ జిల్లా యువజన విభాగం నాయకులు బుర్ర రాజశేఖర్, రాజిరెడ్డి, నాగయ్య, శ్రీహరి, సంపత్, యాకు బ్, మధుకర్ పాల్గొన్నారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...