గ్రామీణ క్రీడాపోటీలు ప్రారంభం


Sun,July 14, 2019 02:06 AM

-400 మంది క్రీడాకారులు హాజరు
వరంగల్‌స్పోర్ట్స్, జూలై 13: రూరల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆదేశానుసారం జిల్లా రూరల్ గేమ్స్ సమాఖ్య రెండు రోజుల పాటు నగరంలో నిర్వహిస్తున్న గ్రామీణ క్రీడాపోటీలు శనివారం ఉదయం ప్రారంభమయ్యాయి. వరంగల్ ములుగురోడ్ సమీపంలోని ఎల్‌బీ కళాశాల క్రీడామైదానం వేదికగా ఏర్పాటు చేసిన ఈ పోటీల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 400మంది ఔత్సాహిక క్రీడాకారులు ప్రాతినిథ్యం వహిస్తున్నట్లు నిర్వహణ కార్యదర్శి సంతోష్ తెలిపారు. జిల్లాస్థాయిలో ప్రతిభచూపిన వారు ఆగస్టులో జరుగబోయే పోటీల్లో ఆయా క్రీడాంశాల్లో జిల్లా జట్లకు ప్రాతినిధ్యం వహిస్తారని చెపారు. అండర్-14, 17, 19 విభాగాల్లో బాలబాలికలకు ఏర్పాటుచేసిన పోటీల్లో వాలీబాల్, అథ్లెటిక్స్, కబడ్డీ, కిక్‌బాక్సింగ్, బాస్కెట్‌బాల్, యోగా, బాక్సింగ్, ఫుట్‌బాల్, త్రోబాల్, రెజ్లింగ్, కరాటే, షిలాంబో, కుంగ్‌ఫూ, ఖోఖో, హ్యాండ్‌బాల్ వంటి క్రీడాంశాల్లో పోటీలను నిర్వహిస్తామన్నారు. ఇందులో భాగంగా మొదటి రోజు శనివారం ఔట్‌డోర్ క్రీడాంశాల్లో పోటీలను నిర్వహించామని, ఆదివారం ఇండోర్ క్రీడాంశాల్లో పోటీలను నిర్వహిస్తామని వివరించారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...