మై లంచ్ బాక్స్ లోగో ఆవిష్కరణ


Sun,July 14, 2019 02:05 AM

మిల్స్‌కాలనీ, జూలై 13: ముంబై డబ్బా వాలా తరహాలో గ్రేటర్ వరంగల్ నగరంలోని పాఠశాలల్లో విద్యార్థులకు, ఆఫీసులలోని ఉద్యోగులకు వారివారి ఇళ్ల నుంచే లంచ్‌బాక్స్‌లను రవాణా చే యడానికి నూతనంగా మై లంచ్ బాక్స్-మన వరంగల్ అనే సంస్థ లోగోను శనివారం తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆవిష్కరించారు. లేబర్‌కాలనీకి చెందిన నలుగురు యువకులు మై లంచ్‌బాక్స్ కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించబోతున్నారు. ఈ మేరకు లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంస్థ మేనేజర్ నల్లా అశోక్ మాట్లాడుతూ మై లంచ్ బాక్స్ కార్యక్రమంతో తక్కువ డబ్బులతో సర్వీస్ అందించడమే కా కుండా నిరుద్యోగ యువతకి ఉపాధి లభిస్తుం దని అన్నారు. కార్యక్రమంలో నిర్వాహకులు గుదినేయ మేఘరాజ్, తేలిక విశాల్, దేవునూరి రాజు, కార్పొరేటర్లు కుందారపు రాజేందర్, వస్కుల రాధిక, టీఆర్‌ఎస్ నేతలు వస్కుల బాబు, సయ్యద్ యూనస్ పాల్గొన్నారు.

87
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...