జోరుగా టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు


Sun,July 14, 2019 02:05 AM

కరీమాబాద్, జూలై 13 : డివిజన్‌లో వాడవాడలా టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడుతున్నామని 21వ డివిజన్ కార్పొరేటర్ మేడిది రజిత అన్నారు. శనివారం కోయవాడలో సభ్యత్వ నమోదు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలు టీఆర్‌ఎస్ సభ్యత్వం తీసుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మేడిది మధుసూదన్, కృష్ణవేణి, తదితరులు పాల్గొన్నారు. 20వ డివిజన్‌లో... విద్యానగర్ కాలనీలో టీఆర్‌ఎస్ నాయకుడు అచ్చ వినోద్‌కుమార్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌తోనే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మజీ కార్పొరేటర్ బాసాని శ్రీనివాస్, నాయకులు మందా శ్రీనివాస్, ఎనగందుల సుధాకర్, పూజారి సంపత్, బోరిగం నర్సింగం, రాంబాబు, పింగిలి యాకయ్య, డివిజన్ ఇంచార్జి విజయభాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు. నిన్‌నగర్‌లో.. ఖిలావరంగల్ : శంభునిపేట లెనిన్‌నగర్‌లో శనివారం 8వ డివిజన్ కార్పొరేటర్ బైరబోయిన దామోదర్‌యాదవ్ ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్ సభ్యత్వ నమో దు కార్యక్రమాన్ని చేపట్టారు. ఇంటింట తిరుగుతూ పార్టీ సభ్యత్వ రశీదులను అందచేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు చింతపట్ల కమలాకర్, నాగరాజు, అశోక్, కట్ట రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కొత్తవాడలో... కాశీబుగ్గ: కొత్తవాడ 28వ డివిజన్‌లో టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మాజీ కార్పొరేటర్ యెలగం శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా బూత్ కన్వీనర్ల సమావేశం నిర్వహించి సభ్యత్వం అందజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఇన్‌చార్జి బండారి రమేశ్‌గౌడ్, మాజీ కార్పొరేటర్ గుడిబోయిన మణి, నాయకులు గోపాల్, డివిజన్ అధ్యక్షుడు కొక్కుల సతీశ్, నాయకులు భాస్కరాచారి, కుమార్, అంజయ్యయాదవ్, మామిళ్ల నరసింహులు, రాజేందర్, సంపత్, చిట్టిమల్ల రమేశ్, కురపాటి సంతపత్, బ్వరాజ్ రమేశ్, మండల కిషన్, బొల్లు సతీశ్, ఉపేంద్ర, కోడూరు నరేశ్‌మోక్ష, శ్రీకాంత్, నరేశ్, రవీందర్, సాంబా, నంబి మురళి పాల్గొన్నారు.

68
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...