ఎన్నికల నిర్వహణకు సహకరించాలి


Fri,July 12, 2019 02:18 AM

నర్సంపేట, నమస్తేతెలంగాణ : ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు అన్ని పార్టీల నేతలు సహకరించాలని నర్సంపేట మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్‌రావు కోరారు. గురువారం నర్సంపేట మున్సిపాలిటీలో ఆల్ పార్టీ మీటింగ్‌ను నిర్వహించారు. ఈ సమావేశానికి పలు పార్టీలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలను నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనుందన్నారు. ఇప్పటివరకు మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డుల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్లను గుర్తించామని చెప్పారు. దీని ప్రకారం జాబితాలు కూడా ప్రదర్శించామని తెలిపారు. అభ్యంతరాలకు రెండు రోజులు గడువు ఇచ్చామన్నారు. ఫిర్యాదులను పరిశీలించి తుది జాబితాను ప్రదర్శిస్తామని వివరించారు. పట్టణ పరిధిలో 27,459 మంది ఓటర్లు ఉన్నారన్నారు. దీని ప్రకారం 24 వార్డులుగా నిర్ణయించామని తెలిపారు. గతంలో 20 వార్డులు ఉండేవని, ప్రస్తుతం మరో నాలుగు పెరిగాయన్నారు. వార్డుల విభజన కూడా నిబంధనల ప్రకారమే చేపట్టినట్లు తెలిపారు. అయితే, వార్డుల వారీగా రిజర్వేషన్లు త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు పార్టీల నాయకులు సహకరించాలని కోరారు. ఎన్నికల నిబంధనల ప్రకారం పార్టీల నాయకులు, శ్రేణులు నడుచుకోవాలన్నారు. ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి నిబంధనలు అమలులో ఉంటాయన్నారు. అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేయడం, బీ ఫాంలు అందించడం లాంటివి సకాలంలో పూర్తి చేయాలన్నారు. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరుగుతాయని, దాని ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుందన్నారు. మున్సిపల్ అధికారులకు, ఎన్నికల నిర్వహణ అధికారులకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ, వైఎస్సార్‌సీపీ, సీపీఐ, సీపీఎం, తెలంగాణ జనసమితి తదితర పార్టీల నాయకులు హాజరయ్యారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...