జర్నలిస్టుల సంక్షేమ నిధి సహాయానికి దరఖాస్తు చేసుకోవాలి


Tue,June 18, 2019 02:38 AM

న్యూశాయంపేట, జూన్17: సంక్షేమ నిధి నుంచి ఆర్థికసాయం పొందడానికి అర్హులైన జర్నలిస్టు కుటుంబాలు ఈ నెల 24 వరకు దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2014 జూన్ 2న తర్వాత మరణించిన జర్నలిస్టులు సంబంధించిన కుటుంబ సభ్యులు, జర్నలిస్టు వృత్తిలో ఉంటూ అనారోగ్యం బారిన పడి పనిచేయలేని స్థితిలో ఉన్న జర్నలిస్టులు మాత్రమే ఈ ఆర్థిక సహాయానికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గతంలో జర్నలిస్టు సంక్షేమ నిధి నుంచి లబ్ధ్దిపొందిన వారు, ఇప్పటికే మీడియా అకాడమీకి దరఖాస్తులు పంపిన వారు మళ్లీ దరఖాస్తులు చేయాల్సిన అవసరం లేదని పేర్కోన్నారు. దరఖాస్తు చేసుకునే వారుసంబంధిత పౌర సంబంధాల అధికారులైన ఉపసంచాలకులు, సహాయ సంచాలకులు, డీపీఆర్వోల ద్వారా ధ్రువీకరించిన దరఖాస్తులను మీడియా అకాడమీ కార్యాలయానికి పంచించాలన్నారు. జర్నలిస్టుల సంక్షేమ నిధి నుంచి ఇప్పటి వరకు 208 మంది మణించిన కుటుంబాలకు రూ.లక్ష చొప్పున అలాగే 72 మంది ఆనారోగ్యానికి గురైన జర్నలిస్టులకు రూ.50 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించామన్నారు. ఆయా జర్నలిస్టు కుటుంబాలకు రూ.3 వేల పెన్షన్ అందిస్తున్నామని,144మంది పిల్లలకు రూ.1000 చొప్పున ట్యూషన్ ఫీజు అందిస్తున్నామని తెలిపారు. జర్నలిస్టులు తమ దరఖాస్తుల్ని కార్యదర్శి, తెలంగాణ మీడియా అకాడమీ, హైదరాబాద్, చిరునామా ఇంటినం. 10-2-1, సమాచార భవన్, 2వ అంతస్తు, ఏసీ గార్డ్స్, మాసబ్ ట్యాంకు, తెలంగాణ రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ కాంప్లెక్స్, హైదరాబాద్‌కు పంపవలసిందిగా ఆయన ఆ ప్రకటనలో తెలిపారు. ఇతర వివరాలకు కార్యాలయ 040-23298672,23298674 నంబర్లను సంప్రదించాలని తెలిపారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...