హసన్‌పర్తి పెద్ద చెరువును కాపాడాలి


Tue,June 18, 2019 02:37 AM

-కేటీఆర్ ట్విట్టర్‌లో హసన్‌పర్తి వాసి ట్వీట్
హసన్‌పర్తి, జూన్ 17: మండల కేంద్రంలోని హసన్‌పర్తి పెద్ద చెరువును కబ్జా నుంచి కాపాడాలని కోరుతూ హసన్‌పర్తికి చెందిన వినియోగదారుల సమాచార కేంద్రం చైర్మన్ అనుమాండ్ల విద్యాసాగర్ కేటీఆర్ ట్విట్టర్‌లో ట్విట్ చేస్తూ పోస్టులు పెట్టారు. గత వారం రోజులుగా నమస్తే తెలంగాణ దినపత్రికలో కబ్జా కోరల్లో హసన్‌పర్తి పెద్ద చెరువు...ఎఫ్‌టీఎల్ పరిధిలో నిబంధనలకు విరుద్దంగా మట్టి కుప్పలు.. అనే అంశంపై ప్రచురితమైన వార్తా కథనాలపై విద్యాసాగర్ సోమవారం కేటీఆర్ ట్విట్టర్‌లో దినపత్రిక కటింగులతో పోస్టు చేశారు. ఆయన కేటీఆర్ ట్విట్టర్‌లో పోస్టు చేస్తూ రాసిన వివరాలిలా ఉన్నాయి. గౌరవ నీయులైన తారకరామారావు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి ముఖిలిత హస్తాలతో నమస్కరించి విన్నవించున్నది. మాది హసన్‌పర్తి. మా పెద్ద చెరువు ఎఫ్‌టీఎల్‌లో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధ్దంగా ప్లాటింగ్ చేస్తున్నారు. మా చెరువే మాకు జీవనాధారం. చెరువు కట్టను కుదించి ట్యాంక్‌బండ్ అభివృద్ధి చేస్తున్నారు. దీనివల్ల మా చెరువు విస్తీర్ణం, నీటి సామర్థ్యం తగ్గి ఊరి జనాభా నీటి కొరతను ఎదుర్కొంటారు. ఎఫ్‌టీఎల్‌లో ఎన్‌వోసీ ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని, మా ఊరి చెరువును కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ముఖ్యమంత్రి గారి ప్రయత్నానికి తూట్లు పొడుస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. అంటూ కేటీఆర్ ట్విటర్‌లో ట్వీట్ చేశాడు.

79
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...