కొనసాగుతున్న సర్టిఫికెట్ల పరిశీలన


Tue,June 18, 2019 02:37 AM

వరంగల్ క్రైం, జూన్17 : కానిస్టేబుల్, ఎస్సై నియామకాలకు సంబంధించి కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అభ్యర్థ్ధుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ కొనసాగుతుంది. ఈ నెల 14వ తేదిన ప్రారంభమైన వెరిఫికేషన్ భూపాలపెల్లి అడిషినల్ ఎస్పీ రాజమహేంద్రనాయక్ పర్యవేక్షణలో ప్రశాంతంగా జరుగుతోంది. ఇప్పటి వరకు వరంగల్ కమిషనరేట్‌లోని (వరంగల్ అర్బన్, రూరల్, జనగాం) ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల నుంచి హాజరైన 1026 మంది అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించారు. నియామకాలకు సంబంధించి దళారుల మాటల నమ్మొద్దని, అలాంటి వారు ఎవరైనా సంప్రదిస్తే పోలీసులకు సమాచారం అందించాలని, పూర్తి పారదర్శకతతో నియామకాలు జరుగుతాయని అడిషినల్ ఎస్పీ రాజమహేంద్రనాయక్ తెలిపారు. కార్యక్రమంలో కమిషనరేట్ పరిపాలన విభాగం ఇన్‌చార్జి అదనపు ఎస్పీ శ్యాంసుందర్‌సింగ్, ఏఆర్ ఏసీపీ మల్లికార్జున్, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ పుల్యాల కిషన్, సైబర్ క్రైం ఇన్‌స్పెక్టర్ దేవనపల్లి విశ్వేశ్వర్, ఆర్‌ఐ నగేశ్ పాల్గొన్నారు.

83
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...