బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించాలి


Tue,June 18, 2019 02:37 AM

-డీఈవో నారాయణరెడ్డి
ఎల్కతుర్తి : గ్రామాల్లో బడి ఈడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలని జిల్లా విద్యాశాఖాధికారి నారాయణరెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ గ్రామాల్లో బడి ఈడు పిల్లలందరూ బడిలోనే ఉండాలన్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల వివిధ కారణాలతో బడి మానేసిన విద్యార్థులను బడిలో చేర్పించాలన్నారు. ముందస్తుగా బడిబాట కార్యక్రమాన్ని చేపట్టడం వల్ల అడ్మిషన్లు అధికంగా వస్తున్నాయన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల కోసం విద్యార్థుల తల్లిదండ్రులు వస్తున్నట్లు చెప్పారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దడం జరిగిందన్నారు. విద్యార్థులకు ఉచితంగా యూనిఫాం, పుస్తకాలు అందజేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు వెల్లడించారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పదో తరగతిలో మంచి జీపీఏ సాధించినట్లు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో 10 జీపీఏ సాధించిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు జిల్లా కలెక్టర్ విద్యార్థులతో కలిసి భోజనం చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ నిరంజన్‌రెడ్డి, జేసీడీవో రమాదేవి, ఎంపీడీవో ఇందుమతి, ఎంఈవో రవీందర్, ఎంపీటీసీ మునిగడప లావణ్య, ప్రధానోపాధ్యాయులు విజయలక్ష్మి, మల్లయ్య, అనితదేవి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...