కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా బోధన


Tue,June 18, 2019 02:36 AM

హసన్‌పర్తి, జూన్ 17: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కేజీ టు పీజీ ఉచిత విద్యా విధానాన్ని అంకితభావంతో అమలు చేస్తోందని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మండలంలోని ఎల్లాపూర్‌లో ఏర్పాటు చేసిన నూతన బీసీ గురుకుల పాఠశాలను ఆదివారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుపేద విద్యార్థులకు మెరుగైన, నాణ్యమైన విద్యను అందించేందుకు సీఎం కేసీఆర్ అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు 19 బీసీ గురుకుల పాఠశాలలుండేవని ప్రస్తుతం అవి 291కి చేరాయని చెప్పారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో విద్యా విధానాన్ని కొనసాగిస్తున్నామని తెలిపారు. పాఠశాలల్లో మౌలిక వసతులతో పాటు ఉచితంగా పౌష్టికాహారం అందిస్తూ విద్యార్థులు ఉన్నతస్థాయిలో రాణించేలా కృషి చేస్తోందన్నారు. వచ్చే మూడేళ్లలో రాష్ట్రంలో 1200 గురుకుల పాఠశాలలను నె లకొల్పి 7.60 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలిగించేలా సీఎం కేసీఆర్ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఏడేళ్లలో అంచెలంచెలుగా వీటిని విస్తరించి కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య అందించేలా తరగతులను అప్‌గ్రేడ్ చేసే కార్యాచరణతో ప్రభుత్వం ముందుకుసాగుతుందన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సుభాశ్‌గౌడ్, రేణికుంట్ల సునిత, కార్పొరేటర్లు సమ్మిరెడ్డి, వెంకటేశ్వర్లు, ఆర్‌ఎస్‌ఎస్ మండల కో-ఆర్డినేటర్ అంచూరి విజయ్‌కుమార్, వైస్ ఎంపీపీ బండ రత్నాకర్‌రెడ్డి, బిల్ల ఉదయ్‌రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

105
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...