కాకతీయుల కళాఖండాలకు పూర్వ వైభవం


Mon,June 17, 2019 03:29 AM

ఖిలావరంగల్, జూన్ 16 : కాకతీయుల కళాఖండాలకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. చారిత్రక నేపథ్యం కలిగిన ఓరుగల్లు కోటను ఆయన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌తో కలిసి ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, కార్పొరేటర్ బైరబోయిన దామోదర్ మంత్రికి పుష్పగుచ్ఛాలు, శాలువాతో సత్కరించి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం నిర్మాణంలో ఉన్న రాష్ట్ర వారసత్వశాఖ మ్యూజియంను పరిశీలించా రు. పనుల ఆలస్యానికి గల కారణాలను తెలుసుకున్నా రు. త్వరగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అనంతరం కీర్తితోరణాలను వీక్షించగా గైడ్ రవియాదవ్ దాని చారిత్రక నేపథ్యాన్ని వివరించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ హైదరాబాద్‌కు దీటుగా వరంగల్‌ను అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. 70 ఏళ్లుగా చారిత్రక, వారసత్వ కట్టడాలను ఎవరూ పట్టించుకోలేదని కేవలం టీఆర్‌ఎస్ ప్రభుత్వమే అభివృద్ధి చేస్తోందన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాలను పర్యాటకరంగంగా అభివృద్ధి చేస్తామన్నారు. కాళేశ్వరం గొప్ప ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దేందుకు ప్రతిపాదనలు పూర్తయ్యాయన్నారు. కాకతీయులు ప్రజల శ్రేయస్సు కోసం నిర్మించిన చెరువులను నేడు సీఎం కేసీఆర్ మిషన్ కాకతీయ పేరుతో అభివృద్ధి చేస్తూ జనరంజక పాలన కొనసాగిస్తున్నారన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ చూసినా చారిత్రక ఆనవాళ్లు కనపిస్తున్నాయన్నారు. దశల వారీగా అన్ని ప్రాంతాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారన్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలు, కాకతీయుల శిల్పకళా సంపద పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయన్నారు. వరంగల్‌లో పర్యాటక ప్రాంత స్థితిగతులను తెలుసుకొనేందుకు సీఎం కేసీఆర్ పర్యాటక మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను పంపించారన్నారు. బమ్మెర పోతన, వల్మిడి, పెంబర్తి, జఫర్‌గడ్, ఖిలాషాపురం, వేయిస్థంభాల గుడిని పరిశీలించామన్నారు. ఈ ప్రాంతాలను గత పాలకులు నిర్లక్ష్యం చేశారన్నారు. సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాత కాకతీయుల పాలన మరోసారి ప్రజల ముందు ఆవిష్కరిస్తున్నారన్నారు. వరంగల్ పర్యాటక ప్రాంతాన్ని నెంబర్ వన్‌గా చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో మేయర్ గుండా ప్రకాశ్‌రావు, డీటీవో శివాజీ, టీఎస్‌టీడీసీ జనరల్ మేనేజర్ (హోటల్), టీఆర్‌ఎస్ నాయకులు సోమిశెట్టి ప్రవీణ్, కొప్పుల శ్రీనివాస్, మర్రి శ్రీనివాస్, రావుల రాజేశ్, టీఎస్‌టీడీసీ కోట ఇన్‌చార్జి అజయ్, బైరబోయిన ప్రకాశ్‌యాదవ్ పాల్గొన్నారు.

78
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...