అభివృద్ధిని పరుగులు పెట్టిస్తాం..


Sat,June 15, 2019 02:37 AM

-నగర సుందరీకరణకు ప్రణాళికలు
-టూరిస్ట్ హబ్‌గా తీర్చిదిద్దుతాం..
-జంక్షన్ల విస్తరణకు స్థల సేకరణ
-నగర మేయర్గుండా ప్రకాశ్‌రావు
-ఎంపీ బండా ప్రకాశ్, ఎమ్మెల్యే నరేందర్‌తో కలిసి జంక్షన్ల పరిశీలన
వరంగల్, నమస్తే తెలంగాణ: కాకతీయుల వారసత్వ నగరం వరంగల్ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని మేయర్ గుండా ప్రకాశ్‌రావు అన్నారు. శుక్రవారం రాజ్యసభ సభ్యుడు డాక్టర్ బండా ప్రకాశ్, తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌తో కలిసి వ రంగల్ రైల్వేస్టేషన్, వరంగల్‌చౌరస్తా, పోచమ్మమైదాన్, ఎంజీఎం జంక్షన్లను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈసందర్భంగా మేయర్ మాట్లాడుతూ వరంగల్ నగరానికి ఉన్న చారిత్రక నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అభివృద్ధ్ది ప్రణాళికలు చేస్తామన్నారు. రోజురోజుకూ దిశలో అభివృద్ధి చేస్తామని అన్నారు. నగరాన్ని టూరిస్ట్ హబ్‌గా తీర్చిదిద్ది ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. నగరంలోని జంక్షన్ల అ భివృద్ధికి ప్రణాళికలు చేస్తున్నామని, జంక్షన్ల విస్తరణకు స్థల సేకరణ చేస్తామని అన్నా రు. ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో అభివృద్ధ్దిని పరుగులు పెట్టిస్తామని అన్నారు.

ఎంపీ బండా ప్రకాశ్ మాట్లాడుతూ జంక్షన్ల అభివృద్ధిపై పలు ప్రభుత్వ శా ఖల సహాయం తీసుకోవాలని సూచించారు. బీఎస్‌ఎన్‌ఎల్, ఆర్టీసీలాంటి సంస్థలతో సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసి, వారి సహకారంతో ముందుకుపోవాలని అన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ రెండోసారి ప్రభుత్వం ఏర్పా టు అయ్యాక వరుసగా ఎన్నికలు వచ్చాయన్నారు. ప్రస్తుతం కోడ్ ముగియడంతో అభివృద్ధి పనులతో ముందుకుపోతామని అన్నారు.

నగరంలోని అన్ని జంక్షన్లను అభివృద్ధి చేస్తామని, అందుకు తగిన కార్యాచరణ రూపొందిస్తున్నామని అన్నారు. తూర్పు నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్నారు. కార్యక్రమంలో బల్దియా కమిషనర్ రవికిరణ్, ట్రాఫిక్ ఏసీపీ మహ్మద్ మజీద్, ఎస్‌ఈ బిక్షపతి, కుడా పీవో అజిత్‌రెడ్డి, ఎంహెచ్‌వో డాక్టర్ రాజారెడ్డి, సీహెచ్‌వో సునీత, బల్దియా ఈఈ లకా్ష్మరె డ్డి, కుడా ఈఈ భీమ్‌రావు, బల్దియా డీసీపీలు నర్సింహరాములు, ప్రేమ్‌కుమార్, డీ ఈలు సంజయ్, రవీందర్, కుడా ఏపీవోలు రామా రవీందర్, స్వామి, సీఐలు జీవన్ రెడ్డి, శ్రీధర్
తదితరులు పాల్గొన్నారు.

103
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...