తపాలాశాఖ ఆధ్వర్యంలో ఫొటోగ్రఫీ పోటీలు


Sat,June 15, 2019 02:34 AM

వరంగల్ చౌరస్తా: తపాలా శాఖ ఆధ్వర్యంలో ఫోటోథీమ్ పోటీ నిర్వహించనున్నట్లు వరంగల్ ప్రధాన తపాలాశాఖ అధికారులు ఒక ప్రకటన లో తెలిపారు. తపాలా అధికారులు తెలిపిన వి వరాల ప్రకారం రానున్న స్వాతంత్య్రదినోత్సవా న్ని పురస్కరించుకొని నూతన పోస్టల్ స్టాంప్‌ను ఆవిష్కరణ చేసేందుకు గాంధీయన్ హెరిటేజ్ ఇన్ మోడ్రన్ ఇండియా కార్యక్రమం ద్వా రా ఈ పోటీ నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. భారతదేశ పౌరసత్వం గల వ్యక్తులు ఈ పోటీలో పాల్గొనడానికి అర్హులని వివరించారు. పోటీలో పాల్గొనే వ్యక్తి స్వయంగా తాను తీసిన ఫొటోను ఏ4 సైజులో ప్రింట్ తీసి, దానిని ఇప్పటి వరకు ఎవరి అవసరాలకు వినియోగించలేదనే హామీ పత్రాన్ని జతపరుస్తూ, దానిని సీడీలో సేవ్‌చేసి రెండింటిని న్యూడిల్లీలోని కేంద్ర ప్రధాన తపాలా కార్యాలయానికి జూన్ 30వ తేదీలోపు చేరుకునేలా స్పీడ్‌పోస్టు ద్వారా పంపించాలని సూచించారు. ఒక పోటీదారు ఒక ఫొటో మాత్రమే పంపాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ పోటీలో ప్రథమ బహుమతి పొం దిన ఫొటోకు రూ.50వేల నగదు, రెండో బహుమతి రూ.25 వేల నగదు, మూడో బహుమతిగా రూ.10వేల నగదు పురస్కారం అందించనున్నట్లు తపాలాశాఖ అధికారులు తెలిపారు. మొదటి బహుమతి పొందిన ఫోటో ఆధారంగా ఆగస్టు 15న నూతన పోస్టల్ స్టాంపును ఆవిష్కరించనున్నట్లు వారు తెలిపారు. పూర్తి వివరాలకు వరంగల్ ప్రధాన తపాలా కార్యాలయంలో సంప్రదించాల్సిందిగా కోరారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...