ఐఐటీ జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో మెరిసిన రిషిక్


Sat,June 15, 2019 02:34 AM

-జేఈఈ అడ్వాన్స్ జాతీయ స్థాయిలో 135 ర్యాంకు, ఓబీసీ కోటాలో 13వ ర్యాంకు
-మెయిన్స్ ఫలితాల్లో జాతీయ స్థాయిలో147 ర్యాంకు. ఓబీసీ కోటాలో20వ ర్యాంకు
న్యూశాయంపేట, జూన్14: న్యూశాయంపేట కుర్రాడు జాతీయస్థాయిలో మెరిశాడు. ప్రతిష్ఠాత్మక జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో జాతీయ స్థాయిలో 135 వ ర్యాంకు, ఓబీసీ కోటాలో 13వ ర్యాంకు సాధించారు. జేఈఈ మెయిన్స్‌లో కూడా జాతీయ స్థాయిలో 147వ ర్యాంకు, ఓబీసీలో 20వ ర్యాంకు సాధించా డు. లక్షా 72వేల మంది విద్యార్థులు పోటీపడిన పరీక్షలో జాతీయ స్థాయిలో మెరుగైన ర్యాంకు కైవసం చేసుకుని సత్తా చాటాడు. భవిష్యత్‌లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బెంగుళూరులో చేరి సైంటిస్టు అవుతానని తెలిపారు.
హంటర్‌రోడ్డు న్యూశాయంపేటకు చెందిన పెరుగు రిషిక్ శుక్రవారం ప్రకటించిన జేఈఈ అడ్వాన్స్‌లో ఫలితాల్లో జాతీయ స్థాయిలో 135వర్యాంకు, ఓబీసీ 13వ ర్యాంకు, ఏప్రిల్‌లో ప్రకటించిన జేఈఈ మెయిన్స్‌లో జాతీయ స్థాయిలో 147వ ర్యాంకు, ఓబీసీకోటాలో 20వ ర్యాంకు సాధించాడు. ఉమ్మడి వరంగ ల్ జిల్లా టాప్ ర్యాంకు సాధించాడు. న్యూశాయంపేట కీర్తిని జాతీయ స్థాయిలో నిలిపాడు. రిషిక్ హైదరాబాద్‌లోని శ్రీచైతన్య నారాయణ కళాశాలలో ఇంటర్ పూర్తిచేశాడు. ఒకటి నుంచి 6వ తరగతి వరకు జేఎస్‌ఎం, 7వ తరగతి గ్రీన్‌వుడ్, 8నుంచి 10వ తరగతి వరకు షైన్ పాఠశాలలో విద్యనభ్యసించి పదోతరగతిలో 9.8జీపీఏ సాధించాడు. తర్వాత హైదరాబాద్‌లోని శ్రీచైతన్య నారాయణ కళాశాలలో ఇంటర్ ఎంపీసీలో 980మార్కులు సాధించాడు. తాజాగా జేఈఈ అడ్వాన్స్ ఫలితాల్లో ఏకంగా జాతీయ స్థాయిలో ర్యాంకు సాధించాడు. రిషిక్ ప్రతీ సబ్జెక్ట్‌ను ఇష్టపడి చదవడం వల్లే మంచి ఫలితాలు సాధించాడని తల్లిదండ్రులు పెరుగు దయాకర్-సంధ్య తెలిపారు. దీంతో కిశోర్ వైజ్ఞానిక్ పురస్కార్ యోజన(కేవీపీవై)కి ఎంపికయ్యాడని, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బెంగూళుర్‌లో అడ్మిషన్ వస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...