నేడు ఎంజీఎంకు హైకోర్టు జడ్జి రాక..!


Sat,June 15, 2019 02:33 AM

-దవాఖాన వాతావరణ పరిస్థితుల పరిశీలన
అప్రమత్తమైన అధికారులు, సిబ్బంది
ఎంజీఎం: రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి సీవీ రాములు శనివారం ఎంజీ ఎం దవాఖానను సందర్శించనున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ బత్తుల శ్రీనివాసరా వు శుక్రవారం తెలిపారు. ఈమేరకు దవాఖానలోని అన్ని శాఖలకు చెందిన వైద్యులు, అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. తొలిసారిగా దవాఖానకు హైకోర్టు జడ్జి రాములు వస్తున్నారని తెలిసి ముందస్తు ఏర్పాట్లలో మునిగారు. ప్రధానంగా రోగులకు అం దుతున్న వైద్య సేవలు, దవాఖానలో పచ్చద నం పరిశుభ్రత, వ్యర్థాల తొలిగింపుతోపాటు సుమారు రూ. 1.30 కోట్లతో నిర్మాణం చేపట్టిన సేవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా దవాఖానలోని వార్డులలో కూడా పర్యటించి రోగులకు ఆహ్లా దకర వాతావరణం ఇక్కడ లభిస్తుందా లేదా...? పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశు భ్రంగా ఉంచుతున్నారా.. వ్యర్థాలను ఏఏ చెత్తబుట్టల్లో వేస్తున్నారు..? వాటిని ఏఏ సమయంలో తొలిగిస్తున్నారనే విషయాలను జడ్జి తనిఖీ చేసే అవకాశమున్నట్లు స మాచారం. మొత్తంగా సర్కార్ దవాఖానలలో రోగులకు చికిత్సతోపాటు వాళ్లకు పరి శుభ్రమైన వాతావరణం అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, ఇందుకోసం అధికారులు, సిబ్బంది ఏమేరకు విధులు నిర్వహిస్తున్నారు.. వారి పనితీరు విధా నంపై కూడా ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు సమాచారం. ఉదయం 11:30 గంటల ప్రాంతంలో హైకోర్డు జడ్జీ ఎంజీఎం దవాఖానలో పర్యటిస్తారని ప్రచారం జరుగుతో ంది.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...