అవార్డుల కోసం దరఖాస్తుల ఆహ్వానం


Sat,June 15, 2019 02:33 AM

సిద్ధార్థనగర్, జూన్ 14: భారత ప్రభుత్వం అందజేసే పద్మవిభూషన్, పద్మ భూష న్, ప ద్మశ్రీ అవార్డుల కోసం వరంగల్ అర్బన్ జిల్లా నుంచి దరఖాస్తులు ఆహ్వాని స్తున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కళలు, క్రీడలు, సంఘసేవ, విద్య, వైద్యం, విజ్ఞానశాస్త్రం, సాంకేతిక, పరిశ్రమలు, వ్యాపార రంగాల్లో విశిష్ట సేవలు చేసిన వారికి ఈ అవార్డులను ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఆసక్తి, అర్హతలు గలవారు నియమ, నిబంధనలు, దరఖాస్తు చేసుకునేందుకు www.padmaawards.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు. దరఖా స్తుతోపాటు దానికి అనుబంధంగా చేసినటువంటి సేవలకు సంబంధించిన వివరాలు ప్రెస్‌క్లిప్స్‌తో 3 సెట్లు జతచేసి, ఈనెల 28 సాయంత్రం 5 గంటలలోపు ములుగురోడ్ ఇండస్ట్రియల్ ఏస్టేట్‌లోని జిల్లా యువజన, క్రీడల అధికారి కార్యాలయంలో స్వయం గా అభ్యర్థులే అందజేయాలని సూచించారు. నిర్ణీత తేదీ తర్వాత వచ్చిన దరఖాస్తులు తిరస్కరించబడుతాయని ఆయన పేర్కొన్నారు.

76
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...