గ్రామ పంచాయతీ భవనానికి స్థలం కేటాయించాలి


Sat,June 15, 2019 02:33 AM

హసన్‌పర్తి, జూన్ 14: మండలంలోని హరిశ్చంద్రనాయక్ తండా పంచాయతీ నూతన భవన నిర్మాణానికి ప్రభుత్వ స్థలం కేటాయించాలని గ్రామస్తులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. శుక్రవారం హెచ్‌సీఎన్ తండా పంచాయతీ కార్యాలయం ఆవరణలో సర్పంచ్ నూనావత్ ఐలమ్మ అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయ భవన నిర్మాణంతో పాటు హరితహారం యాక్షన్ ప్లాన్‌పై చర్చించారు. అనంతరం సర్పంచ్ ఐలమ్మ మాట్లాడుతూ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని, గ్రామాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ జట్టి మంజుల, పంచాయతీ కార్యదర్శి యాకలక్ష్మి, ఉపసర్పంచ్ భూక్య రాజు, ఫీల్డ్ అసిస్టెంట్ తిరుపతి, వార్డు మెంబర్లు, తండావాసులు పాల్గొన్నారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...