రంగయ్యపల్లిలో వైద్యశిబిరం


Sat,June 15, 2019 02:33 AM

భీమదేవరపల్లి: వంగర ప్రాథమిక ఆరోగ్యకేంద్రం పరిధిలోని రంగయ్యపల్లి గ్రామంలో శుక్రవారం నిర్వహించిన ఉచిత వైద్యశిబిరానికి అనూహ్య స్పందన లభించింది. ఈ సందర్భంగా క్యాన్సర్, మధుమేహం, రక్తపోటు వ్యాధులకు ఉచితంగా చికిత్సలు జరిపి మందులు పంపిణీ చేశారు. వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు ఆరోగ్య నియమాలు, ఆహారపు అలావాట్లను గూర్చి గ్రామస్తులకు వైద్య సిబ్బంది అవగాహన కల్పించారు. వడదెబ్బతగులకుండా ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను వినియోగించాలని, వాటి ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో వంగర వైద్యాధికారిణి స్వరూపరాణి, సర్పంచ్ యామ వెంకటరాములు, సట్ల రఘుపతి, వార్డుసభ్యులు యాదలక్ష్మి, మొగిళి, మునిరాబేగం, అంకుస్‌బీ, రాజ్‌కుమార్, రేణుక, మల్లారెడ్డి, రమేశ్, వైద్యసిబ్బంది మహేందర్, కేఎల్‌ఎన్ స్వామి, తారాబాయ్, రాజ్‌కుమార్, లాలా, కరుణశ్రీ, స్వరూప, రజిత, సునిత, జ్యోతి, పద్మ, అజిత, సుధీర్, గ్రామస్తులు పాల్గొన్నారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...