ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి


Sat,June 15, 2019 02:32 AM

ఎల్కతుర్తి : ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని సీఐ శ్రీనివాస్‌జీ చెప్పారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా ఎంపీడీవో కార్యాలయంలో అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఐ శ్రీనివాస్‌జీ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. బడిబాట కార్యక్రమంలో గ్రామాల్లోని ప్రతి ఇంటికి వెళ్లి విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించే విధంగా తల్లిదండ్రులను చైతన్య పర్చాలన్నారు. ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల ఉద్యోగుల సహకారంతో తీసుకోవాలని సూచించారు. పోలీసు శాఖ తరుపున బడిబాటలో భాగస్వాములమవుతామని తెలిపారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ సత్యనారాయణ, ఎంఈవో రవీందర్, ప్రభుత్వ పాఠశాలల ఫేరెంట్స్ కమిటీ అధ్యక్షుడు నాగేశ్వర్, హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...