ఐనవోలు మల్లన్నను దర్శించుకున్న జెడ్పీ వైస్ చైర్మన్


Sat,June 15, 2019 02:32 AM

ఐనవోలు, జూన్ 14 : ఐనవోలు మల్లికార్జునస్వామిని జెడ్పీ వైస్ చైర్మన్ గజ్జెల్లి శ్రీరాములు కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయానికి వచ్చిన శ్రీరాములు, కుటుంబ సభ్యులకు ఆలయ సిబ్బంది, అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ సంప్రాదయం ప్రకారం అశీర్వచనాలతో లడ్డూ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన జెడ్పీ వైస్ చైర్మన్‌ను సిబ్బంది, అర్చకులు శాలువతో సన్మానం చేసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, అర్చకులు తదితరులు పాల్గొన్నారు. అలాగే వరంగల్ అర్బన్ జెడ్పీ వైస్ చైర్మన్ గజ్జెల్లి శ్రీరాములును కారోబార్‌లు శ్రీరాములును మర్యాపూర్వంగా కలిసి శాలువాతో సన్మానం చేసి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...