పేద విద్యార్థులకు సేవ అభినందనీయం


Mon,May 27, 2019 02:00 AM

కాశీబుగ్గ, మే26: నగరంలోని నర్సంపేట రోడ్డులో కలాం కంప్యూటర్ ఎడ్యుకేషన్ సెంటర్‌లో పేద విద్యార్థులకు కంప్యూటర్ కోచింగ్ ఇచ్చి సర్టిఫికెట్లను అందజేయడం అభినందనీయమని డాక్టర్ చింతం ప్రవీణ్‌కుమార్ అన్నారు. ఆదివారం కంప్యూటర్ సెంటర్‌లో సేవా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో గత నెలలో విద్యార్థులకు కోచింగ్ నిర్వహించి సర్టిఫికెట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి అని అన్నారు. సేవా వెల్ఫేర్ సొసైటీ ద్వారా పేదలకు మరిన్ని సేవా కార్యక్రమాలు అందించి ఆదర్శంగా నిలువాలని కోరారు. ఉచిత విద్యను విద్యార్థులు అందిపుచ్చుకోవాలన్నారు.కార్యక్రమంలో సంస్థ ముఖ్య సలహాదారులు పాలడుగుల సురేందర్, అయిత ఉషాభాస్కర్, జూపాక రత్నప్రణయ్, లక్ష్మీజగన్, మధుకర్, ఉదయ్, సుదాకర్, రాజు, సుశాంత్, జీవన్, సాయిరాం పాల్గొన్నారు.

77
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...