కట్టుకున్నోడే కాలయముడు..


Sat,May 25, 2019 03:10 AM

వర్ధన్నపేట, నమస్తే తెలంగాణ: కుటుంబ కలహాలతో భార్యను గొడ్డలితో భర్త దారుణంగా నరికి హత్య చేసిన సంఘటన మండలంలోని కట్య్రాల గ్రామంలో శుక్రవారం వెలుగు చూసింది. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. రాయపర్తి మండలం కొత్తూరు గ్రామానికి చెందిన సుక్క దూడయ్య, కొమురమ్మ కూతురు మల్లికాంబ(43)ను వర్ధన్నపేట మండల కట్య్రాల గ్రామానికి చెందిన చెవ్వళ్ల యాదగిరికి 25 ఏళ్ల క్రితం ఇచ్చి వివాహం జరిపించారు. వీరికి ప్రవీణ్, ప్రశాంత్ అనే ఇద్దకు కుమారులు జన్మించారు. ఆ తరువాత కుటంబ కలహాలు ప్రారంభమయ్యాయి. ఎనిమిదేళ్ల క్రితం భార్యాభర్తల మధ్య వచ్చిన తగాదాతో మల్లికాంబ తన పెద్ద కుమారుడైన ప్రవీణ్‌ను తనతో తీసుకువెల్లి తల్లిగారి గ్రామమైన కొత్తూరులోనే నివాసం ఉంటుంది. యాదగిరి తన చిన్న కుమారుడు ప్రశాంత్ తో కలిసి కట్య్రాలలోని ఆయన ఇంట్లోనే జీవిస్తున్నారు. భార్యాభర్తలను కలిపేందుకు పలుమార్లు పెద్ద మనుషులు పంచాయితీలు నిర్వహించి సక్యత చేసేందుకు ప్రయత్నించారు.మల్లికాంబ తనను కాపురానికి తీసుకువెళ్లడంలేదని పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేసినట్లు వారి కుటుం బ సభ్యులు తెలిపారు.

కుమారులు ఇద్దరు పెద్దవాళ్లవుతున్నందున కలిసి కాపురం చేయాలని 20 రోజుల క్రితం మరోసారి ఇరు గ్రామాలకు చెందిన పెద్ద మనుషులు, బంధువులు పంచాయితీ నిర్వహించి భార్యాభర్తలకు సర్ది చెప్పారు. అలాగే పెద్ద కుమారుడైన ప్రవీణ్ కూడా కలిసి ఉండాలని తల్లిదండ్రులను కోరాడు. దీంతో ఈ నెల 16వ తేదీన మల్లికాంబ కాపురానికి వచ్చింది. పెద్దకుమారుడు రెండు రోజుల క్రితమే హైదరాబాద్‌లో పనిచేసేందుకు వెళ్లగా యాదగిరి, మల్లికాంబ, చిన్నకుమారుడు ప్రశాంత్ గతవారం రోజులుగా ఇంట్లోనే కలిసి ఉంటున్నారు. ఈ క్రమంలోనే గురువారం రాత్రి ప్రశాంత్ ఇంటి దాబాపై నిద్రించేందుకు వెళ్లగా భార్యాభర్తలు ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు. భార్యపై కోపం పెంచుకున్న యాదగిరి అర్ధరాత్రి మల్లికాంబ మెడపై గొడ్డలితో నరికాడు. తెల్లవారే సరికి మల్లికాంబ హత్యకు గురై ఉండడంతో ప్రశాంత్ ఆందోళనకు గురై చుట్టుపక్కల వారికి చెప్పాడు. విషయం తెల్లవారుజామున పోలీసులకు తెలియడంతో సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు.

ఎనిమిదేళ్లుగా దూరం ఉంటున్న భార్యాభర్తలు
ఎనిమిదేళ్ల క్రితం జరిగిన గొడవ మూలంగా భార్యాభర్తలు ఇద్దరు కాపురానికి దూరమయ్యారు. ఈ క్రమంలోనే ఈ నెల 16న పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ నిర్వహించి ఒప్పందం చేసుకున్నారు. కానీ మనుసులో కోపంతో ఉన్న యాదగిరి గురువారం రాత్రి ఇంట్లో మల్లికాంబను గొడ్డలితో నరికి హత్య చే శాడు. విషయం తెలుసుకున్న ఏసీపీ మధుసూదన్, సీఐ శ్రీనివాస్, ఎస్సై సంపత్ సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని వర్ధన్నపేట ప్రభుత్వ దవాఖానకు తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. మృతురాలి అన్న సుక్క నారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

123
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...