అర్హులైన గుడిసెవాసులకు ఇంటి పట్టాలివ్వాలి


Sat,May 25, 2019 03:09 AM

కాజీపేట, మే 24: న్యూ శాయంపేట జాగీరు ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకున్న అర్హులైన పేదలందరికీ ఇంటి పట్టాలు ఇచ్చి న్యాయం చేయాలని సూర్జిత్‌నగర్ కాలనీ అధ్యక్షుడు కారు ఉపేందర్ కోరారు. ఈ మేరకు కాజీపేట డిఫ్యూటీ తహసీల్దార్‌కు శుక్రవారం కాలనీవాసులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాలనీ అధ్యక్షుడు కారు ఉపేందర్ మాట్లాడుతు న్యూ శాయంపేట జాగీరు సర్వే నెంబర్ 579 ప్రభుత్వ భూమిలో సుమారు పదిహేనేండ్ల కింద నిరుపేద కుటుంబాలు గుడిసెలు వేసుకుని సూర్జిత్ నగర్‌గా నామకరణం చేసి జీవిస్తున్నామన్నారు. ఈ కాలనీ నుంచే రేషన్‌కార్డు, ఆధార్‌కార్డులు పొందామని, గుడిసెలకు కరెంట్ మీటర్లను తీసుకున్నామని, మున్సిపల్ అధికారులు ఇచ్చిన ఇంటి నెంబర్లకు క్రమం తప్పకుండా పన్నులు చెల్లిస్తున్నామని చెప్పారు. 2014లో 350 కుటుంబాలు శాశ్వత ఇంటి పట్టాల కోసం దరఖాస్తు చేసుకోగా, 68 మందికి పట్టాలు ఇచ్చారని, మిగతా 282 మందికి కూడా ఇంటి పట్టాలు ఇప్పించి న్యాయం చేయాలని వారు కోరారు. కార్యక్రమంలో రమేశ్, రాజేశ్వరి, మజూర్, శ్యాం సుందర్, వనమాల, కాలనీవాసులు పాల్గొన్నారు.

70
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...