కేయూ దూరవిద్య కేంద్రం డైరెక్టర్ ప్రొఫెసర్ వీరన్న


Sat,May 25, 2019 03:09 AM

రెడ్డికాలనీ, మే 24: లైబ్రరీ సైన్స్‌తో విద్యార్థులకు విస్తృత ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయ ని కేయూ దూరవిద్యా కేంద్రం డైరెక్టర్ ప్రొఫెసర్ జీ వీరన్న అన్నారు. కాకతీయ యూనివర్సిటీ దూరవిద్య కేంద్రంలో శుక్రవారం బీఎల్‌ఐఎస్సీ బ్యాచ్ విద్యార్థుల వీడ్కోల సమావేశం కేయూ గ్రంథాలయ విశ్రాంతాచార్యులు ప్రొఫెసర్ కే రమణయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వీరన్న మాట్లాడుతూ మూడు దశాబ్దాలుగా కోర్సును విజయవంతంగా నిర్వహిస్తున్నామని, వందలాది మందికి ఉద్యోగావకాశాలు లభించాయన్నారు. విద్యార్థులకు మరిన్ని మెరుగైన సౌకర్యాలను కల్పించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోనున్నట్లు ఆయన చెప్పారు. త్వరలో పరీక్షలు నిర్వహించి, ఫలితాలను ప్రకటించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఇతర కోర్సులతో పోలిస్తే లైబ్రరీ సైన్స్ విద్యార్థులకు మంచి ఉపాధి అవకాశాలున్నాయన్నారు. కార్యక్రమంలో లైబ్రరీ సైన్స్ విభాగాధిపతి బీ రాధికారాణి, ఫ్యాకల్టీ వీ కృష్ణమాచార్య, ధనుంజయ, డాక్టర్ ఇంద్రసేనారెడ్డి, నిరంజన్, దూరవిద్య గ్రంథాలయం ఇన్‌చార్జి సాధ్విమణి, విద్యార్థులు గజ్జి దయాకర్, రమేశ్, హనోక్, శ్రావణిరెడ్డి, శృతి, సోని ఇతర విద్యార్థులు పాల్గొన్నారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...