క్యాంపస్ ఇంటర్వ్యూలో 501 మంది ఎంపిక


Sat,May 25, 2019 03:09 AM

-కిట్స్ కాలేజీలోని 2018-19 అకడమిక్ ఇయర్ విద్యార్థుల ఘనత
-విద్యార్థులను అభినందించిన ఎంపీ, కిట్స్ కాలేజీ సెక్రటరీ కెప్టెన్ లక్ష్మీకాంతారావు
భీమారం,మే24: గ్రేటర్ వరంగల్ పరిధిలోని భీమారం ఎర్రగట్టు గుట్ట ప్రాంతంలోని కిట్స్ ఇంజినీరింగ్ కాలేజీలో 2018-19లో అకడమిక్ ఇయర్‌లో నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూల్లో 501 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించినట్లు కాలేజీ ప్రిన్సిపాల్ అశోక్‌రెడ్డి శుక్రవారం తెలిపారు. విద్యార్థులంతా మల్టీనేషనల్ సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారన్నారు. ఈ నియామకాల్లో అత్యధికంగా రూ. 21 లక్షల ప్యాకేజీతో ఎంపికైనట్లు తెలిపారు. టీసీఎస్ కంపెనీలో అత్యధికంగా 69 మంది ఉద్యోగాలకు ఎంపికైనట్లు తెలిపారు. ఇన్ఫోసిస్‌లో 65 మంది, విప్రోలో 53 మంది, హెచ్‌సీఎల్ కంపెనీలో 31 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారన్నారు. ఈ కంపెనీలతో పాటు మ్యై సిగ్మా, జీజీకే టెక్నాలజీస్, నైస్‌లీప్స్, ఏడీ త్రి ఐ, అఖిరాన్ , ఏఐఆర్ వరల్డ్ వైడ్ కంపెనీ, అమర్‌రాజా బ్యాటరీస్, అమృత టైల్ క్రాఫ్ట్స్ రామ్ గ్రూపు తదితర కంపెనీల్లో కిట్స్ విద్యార్థులకు ఉద్యోగాలు వచ్చాయన్నారు. ఎంపికైన విద్యార్థులను కిట్స్ కాలేజీ సెక్రటరీ, రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు, యాజమాన్యం అభినందించింది. ఈ సందర్భంగా కిట్స్ కాలేజీ ట్రైనింగ్, ప్లేస్‌మెంట్స్ అధికారి శ్రీకాంత్ మాట్లాడుతూ.. విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్, మాక్ ఇంటర్వ్యూస్, వెర్బల్ ప్రోగ్రామింగ్, కోక్యూబ్,ఆమ్‌కట్ ద్వారా శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో కిట్స్ కాలేజీ ట్రైనింగ్, ప్లేస్‌మెంట్స్ డీన్ పురందర్ ఎంపికైన విద్యార్థులను అభినందించారు.

120
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...