పరిషత్ ఎన్నికల లెక్కింపు వాయిదా


Sat,May 25, 2019 03:08 AM

సుబేదారి, మే24: జెడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపును వాయిదా వేస్తూ శుక్రవారం రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 6, 10, 14వ తేదీల్లో మూడు విడతలుగా ప్రాదేశిక ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈనెల 27వ తేదీన చేపట్టాల్సి ఉంది. అయితే ఐదేళ్ల క్రితం ఎన్నికైన ఎంపీటీసీ, జెడ్పీటీసీల పదవీకాలం జూలై 4వ తేదీన ముగుస్తుంది. కానీ ఈనెల 27వ తేదీన ఓట్ల లెక్కింపు జరగడం వల్ల, కొత్తగా ఎన్నికైన వారు పదవీబాధ్యతలు చేపట్టడానికి 40 రోజుల వ్యవధి ఉండనుంది. గెలిచిన అభ్యర్థులు ఈ 40 రోజుల వ్యవధిలో మరోపార్టీలో చేరే అవకాశం ఉందని విపక్షాలు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. దీంతో విపక్షాల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్న ఎన్నికల కమిషన్ ఈనెల 27 తేదీన నిర్వహించాల్సిన కౌంటింగ్‌ను వాయిదా వేసింది. తదుపరి తేదీని త్వరలో ప్రకటిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎన్నికల కమిషన్ నిర్ణయంతో ప్రధాన రాజకీయపార్టీల అభ్యర్థుల్లో ఆశలు సన్నగిల్లాయి. గెలుస్తామనే ధీమాలో ఉన్న అభ్యర్థులు ఈసీ ప్రకటనతో నిరుత్సాహపడ్డారు. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అధికారులు పరిషత్ లెక్కింపు ఏర్పాట్లలో ఉన్నారు. అయితే రెండురోజుల క్రితం వరకు ఎంపీ ఓట్ల లెక్కింపుతో విధి నిర్వహణలో ఉన్న అధికారులు, సిబ్బందికి పరిషత్ ఓట్ల లెక్కింపు వాయిదా అని తెలువడంతో కాస్త ఉపశమనం కలిగినట్లయింది

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...