ఘనంగా హేమాచలుడి నాగవెల్లి


Thu,May 23, 2019 02:19 AM

మంగపేట, మే 22 : మండలంలోని మల్లూరు శ్రీహేమాచల లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానంలో కొనసాగుతున్న కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం అర్చకులు హేమాచలుని నాగవెల్లి, పెరుమాళ్లకు చక్రతీర్థం(చక్రస్నానం) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం 9గంటలకు పెరుమాళ్లను పల్లకీలో కూర్చోబెట్టి మేళ వాయిద్యాల నడుమ దేవస్థానం నుంచి చింతామణి సెలయేటి వద్దకు తీసుకొచ్చి చక్రస్నానం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో సాంప్రదాయబద్ధంగా పూజలు జరిపారు. అనంతరం యాగశాలలో హోమాలు జరిపారు. ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఆలయ ప్రాంగణంలో కోడెను కట్టి మొక్కులు తీర్చుకున్నారు. ములుగు డీఎస్పీ విజయసారథి స్వామి వారిని దర్శించుకొని, ఆయా పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క స్వామి వారికి పంపించిన పట్టు వస్ర్తాలను ఏటూరునాగారానికి చెందిన కాంగ్రెస్ నాయకులు గుడి వద్దకు తీసుకొచ్చి సమర్పించారు. సాయంత్రం 5గంటలకు పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. రాత్రి 8గంటలకు లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను యాగశాల నుంచి కల్యాణ మండపంలోకి తీసుకొచ్చి ఆసీనులను చేశారు. నాఖబలి(నాగవెల్లి) తంతును సాంప్రదాయం ప్రకారం జరుపగా, మల్లూరుతోపాటు, ఆయా ప్రాంతాల భక్తులు పాల్గొన్నారు. దేవస్థాన ప్రాంగణంలో మనం వెల్ఫేర్ సొసైటీ బృందం భక్తులకు తాగు నీరు సరఫరా చేశారు. నేడు నిర్వహించే వసంతోత్సవం కార్యక్రమంలో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని దేవస్థాన కార్యనిర్వహణాధికారి శ్రావణం సత్యనారాయణ తెలిపారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...