ఈ సెట్‌లో వరంగల్ విద్యార్థుల ప్రతిభ


Thu,May 23, 2019 02:19 AM

మట్టెవాడ, మే 22: ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశం కోసం పాలిటెక్నిక్ పూర్తిచేసిన విద్యార్థులకు నిర్వహించిన అర్హత పరీక్ష ఈ సెట్ ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబరిచి రెండు బ్రాంచిల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాదించారు. కంప్యూటర్ సైన్స్ విభాగంలో వరంగల్ కాపువాడకు చెందిన విన్నకోట శ్రీవాణి స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించింది. ఆమెతో పాటు ఇదే కళాశాలకు చెందిన వరుణ్ స్టేట్ రెండో ర్యాంక్, రిచిత నాలుగో ర్యాంక్, రమ్య ఐదో ర్యాంకు, భాగ్యరాజ్ ఏడో ర్యాంక్, బిందు 20వ ర్యాంక్ సాధించారు. అలాగే ఈసీఈ విభాగంలో బూర హృషికేశ్ రెండో ర్యాంక్, కొండూరి శ్రీకన్య స్టేట్ నాలుగో ర్యాంక్ సాధించారు. హన్మకొండ గుడిబండల్‌కు చెందిన జోగం గౌతం మెకానికల్ విభాగంలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించారు. ఈ సందర్భంగా గౌతం మాట్లాడుతూ తనకు ఫస్ట్ ర్యాంకు రావడానికి సహకరించిన కళాశాల అధ్యాపకులు, ఐరా అకాడమీ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలుపుతూ తాను మెకానికల్ ఇంజినీర్‌గా రాణిస్తాన్నారు. శ్రీవాణి, గౌతం ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన ఈ సెట్‌లో సైతం ర్యాంకులు సాధించారు. వీరిని వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ డాక్టర్ బైరి ప్రభాకర్, ఐరా అకాడమీ ప్రతినిధి ఐరా దేవా అభినందించారు.

66
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...