ఏనుమాముల మార్కెట్‌లో భారీ భద్రత


Tue,May 21, 2019 01:24 AM

వరంగల్‌ క్రైం, మే 20 : ఈ నెల 23న వరంగల్‌ లోకసభ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు దృష్టా కమిషనరేట్‌ పోలీసులు భారీ భద్రత కల్పించారు. భద్రత విషయంలో ఎలాంటి లోపాలు జరగకుండా వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ వి.రవీందర్‌ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. లెక్కింపు కేంద్రాలకు తరలొచ్చే అధికారుతో పాటు, వివిధ పార్టీలకు చెందిన ఏజెంట్లు కేంద్రానికి చేరుకునేందుకు ఏర్పాటు చేసిన మార్గాలను, బారీకేడ్లను పరిశీలించారు. ఓట్ల లెక్కింపు రోజు కాశీబుగ్గ జంక్షన్‌ నుంచి ఏనుమాముల మార్కెట్‌ వరకు ఎలాంటి ట్రాఫిక్‌ అంతరాయం కలుగకుండా తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై సంబంధిత అధికారులకు సీపీ సూచనలు చేశారు. సీపీ వెంట సెంట్రల్‌ జోన్‌ డీసీపీ నరసింహ, వరంగల్‌ ఏసీపీలు నర్సయ్య, జనార్దన్‌, శ్రీనివాస్‌, ట్రాఫిక్‌ ఏసీపీ ఎండీ. మజీద్‌, ఇంతేజార్‌గంజ్‌, వరంగల్‌ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్స్‌ శ్రీధర్‌, స్వామి తదితరులు పాల్గొన్నారు.

96
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...