ఐసెట్‌కు ఏర్పాట్లు పూర్తి


Tue,May 21, 2019 01:24 AM

రెడ్డికాలనీ, మే 20: కాకతీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో అర్హత పరీక్ష కోసం ఈనెల 23, 24 తేదీల్లో నిర్వహించనున్న టీఎస్‌ ఐసెట్‌-19 పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీఎస్‌ఐసెట్‌ కన్వీనర్‌ సీహెచ్‌.రాజేశం తెలిపారు. ఐసెట్‌ పరీక్ష కోసం మొత్తం 49,465 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 54 సెంటర్లలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు, ఆంధ్రప్రదేశ్‌లో 4 సెంటర్లు, కర్నూల్‌, విజయవాడ, విశాఖపట్టం, తిరుపతి కేంద్రాల్లో 1954 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నట్లు వివరించారు. 64 మంది పరిశీలకులను నియమించినట్లు, ఒక్క హైదరాబాద్‌లోనే అత్యధికంగా పరీక్షలు రాస్తున్నట్లు తెలిపారు. 2905 మంది అభ్యర్థులు ఉర్ధూలో పరీక్ష రాయనున్నట్లు, 24 మంది దివ్యాంగులు పరీక్షకు నమోదు చేసుకున్నట్లు వివరించారు. దివ్యాంగులు సదరం సర్టిఫికెట్‌తో ముందు రోజు పరీక్షా కేంద్రంలో సంప్రదించాలని, అంధులు స్ర్కైబ్‌ అవకాశం కూడా ఉపయోగించుకోవచ్చునని పేర్కొన్నారు. ఆధార్‌కార్డుతో, ఫొటోతో, డిక్లరేషన్‌ ఇవ్వాలని, బయోమెట్రిక్‌ అటెండెంట్స్‌ ఉంటుందన్నారు. ఒక నిమిషం నిబంధన అమలులో ఉందని, 23న ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, 24న ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు. పరీక్ష సెంటర్‌కు ఒక గంట ముందుగా హాజరుకావాలని, అభ్యర్థులు హాల్‌టికెట్‌లోని సూచనలను పాటించాలని కన్వీనర్‌ సీహెచ్‌.రాజేశం తెలిపారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...