ఉత్సాహంగా వాకర్స్ క్రీడలు


Sun,May 19, 2019 02:30 AM

రెడ్డికాలనీ, మే 18: వాకర్స్ ఇంటర్నేషనల్ 303 పరిధిలోని వాకర్స్ సంఘాల సభ్యులకు క్రీడా పోటీలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. నాలుగో రోజు శనివారం కాకతీయ విశ్వవిద్యాలయం మైదానంలో క్రీడలను సీఐ బోనా ల కిషన్, వాకర్స్ ఇంటర్నేషనల్ గవర్నర్ దేశిని లక్ష్మీనారాయణ, యోగా గురువు బండారి మొగిలయ్య ప్రారంభించారు. షటిల్, బ్యాట్మింటన్, కబడ్డీ, వాలీబాద్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల ఫలితాలను వాకర్స్ ఇంటర్నేషనల్ గవర్నర్ దేశిని లక్ష్మీనారాయణ, జిల్లా వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు తడక కుమారస్వామిగౌడ్, కేయూ వాక ర్స్ సంఘం అధ్యక్షుడు సుధాకర్, క్రీడల విభాగ కన్వీనర్ కే రామకృష్ణ, కోకన్వీనర్ నన్నెసాహెబ్, తీగల ఎల్లగౌడ్ ప్రకటించారు. షటిల్ బ్యాడ్మింటన్ ఫైనల్లో వినయ్‌కుమార్, మ ధుకర్‌రెడ్డి జట్టు ప్రథమస్థానంలో, సోమేశ్వర్, వీరన్న ద్వితీయస్థానంలో నిలిచారు. అలాగే కబడ్డీ, వాలీబాల్ పోటీలు హోరాహోరీగా సాగాయి. ఆదివారం కబడ్డీ, వాలీబాల్ జట్ల కు ఫైనల్ పోటీలు నిర్వహించనున్నట్లు, అలాగే యోగా పో టీలు కూడా జరుగుతాయని తెలిపారు. ఐదురోజుల నుంచి జరుగుతున్న వాకర్స్ ఇంటర్నేషనల్ 303 క్రీడోత్సవాలు ఆదివారం ముగుస్తాయని గవర్నర్ దేశిని లక్ష్మీనారాయణ వెల్లడించారు. ఈ పోటీల్లో వాకర్స్ ఇంటర్నేషనల్ 303 ఎ లెక్ట్ గవర్నర్ నర్సింహరావు, డిప్యూటీ గవర్నర్ నల్ల సంతోష్‌రెడ్డి, నగరంలోని వివిధ సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.

80
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...