సమ సమాజ స్థాపనలో బౌద్ధం


Sun,May 19, 2019 02:30 AM

రెడ్డికాలనీ, మే 18: సమ సమాజ స్థాపనలో బౌద్ధం ము ఖ్యమైనదని తెలంగాణ రాష్ట్ర పురావస్తు సంచాలకుడు ఆకునూరి మురళి అన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయ అంబేద్కర్ అధ్యయన కేంద్ర సంచాలకుడు డాక్టర్ గాదె సమ్మ య్య అధ్యక్షతన శనివారం విశ్వవిద్యాలయ ఫార్మసీ కళాశా ల సెమినార్‌హాల్‌లో ఒకరోజు సింపోజియం బుద్ధ్దిస్ట్ ప్రీచిం గ్స్ బుద్ధ జయంతి సందర్భంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ సాయన్న, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కే పురుషోత్తం, ఆకునూరి మురళి బుద్ధుడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమం లో ముఖ్య అతిథిగా పాల్గొన్న మురళి మాట్లాడుతూ ప్రతిఒక్కరూ నిర్మలమైన జీవనంలో పయనించాలన్నారు. అ ష్టాంగ మార్గం అనుసరించాలని, మానవశక్తిని కార్యరూపం చేయాలని సూచించారు. బుద్ధుడి బోధనలు బోధించాలన్నారు. ప్రస్తుతం మనం సామాజిక మాధ్యమాలకు పరిమి తం అయ్యామని, తార్కికంగా ఆలోచించాలని, మేదో వైక ల్యం వెంటాడుతుందన్నారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కే పురుషోత్తం మాట్లాడుతూ బుద్ధుని ప్రవచనాలు వక్రీకరించడ్డాయని, బుద్ధుడు గొప్ప తత్వవేత్త అన్నారు. సంపదలో కొం త సమాజానికి ఇవ్వాలని బుద్ధుడు కోరారని, అంబేద్కర్ నమ్మిన సిద్ధాంతం బౌద్ధమన్నారు. యూజీసీ కోఆర్డినేటర్ ఆచార్య ఎం సారంగపాణి మాట్లాడుతూ గొప్ప ఆర్థికశాస్త్రవేత్త బుద్ధుడు అన్నారు. ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య వీ కిషన్ మాట్లాడుతూ సమసమాజ స్థాపన బుద్ధ్దుడు కోరారన్నారు. దళితరత్న బొమ్మల కట్టయ్య మాట్లాడుతూ బు ద్ధుని మార్గం అనుసరణీయమన్నారు. దేశసంస్కృతిని ప్రతిబించాలన్నారు. కేఎంసీ ప్రొఫెసర్ డాక్టర్ జీ విద్యారెడ్డి, టెక్నికల్ ఉద్యోగులు అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ పుల్లా శ్రీనివాస్, రసాయనశాస్త్ర సహా ఆచార్యులు డాక్టర్ రాజమణి, మాట్లాడారు. సమావేశంలో డాక్టర్ ఆదిరెడ్డి, విద్యార్థులు, పరిశోధకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

72
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...