గంజాయి ముఠా గుట్టు రట్టు


Sun,May 19, 2019 02:30 AM

వరంగల్ క్రైం, మే 18: ఆన్‌లైన్‌లో ఆర్డర్లు తీసుకొని ప్ర త్యేకంగా రూపొందించిన వాహనాల్లో ఎవరికీ అనుమానం రాకుండా గంజాయిని సరఫరా చేసే ముఠాను టాస్క్‌ఫోర్స్, ఎల్కతుర్తి పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.30 లక్షల విలువ చేసే 150 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. ఈమేరకు వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ రవీందర్ శనివారం కమిషనరేట్ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. జఫర్‌ఘడ్ మండలం ముగ్ధుంతండా కు చెందిన బానోతు వీరన్న, ఆత్మకూర్ మండలం సింగరాజుపల్లికి చెందిన బొనగాని బిక్షపతి, వైజాగ్‌కు చెందిన నా యుడు మిత్రులు. గతంలో వీరిపై పాలకుర్తి, ఇంతేజార్‌గం జ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లలో అక్రమ గం జాయి రవాణా, దొంగతనాల కేసులు నమోదయ్యాయి. సు లువుగా డబ్బులు సంపాదించేందుకు దొంగతనాలకు స్వస్థి పలికి ఆన్‌లైన్ గంజాయి రవాణాకు ప్రణాళిక రూపొందించారు. రవాణా కోసం ఎల్కతుర్తి మండలం కేశవపూర్‌కు చె ందిన తీగల రాజు, హన్మకొండ వడ్డేపెల్లికి చెందిన జెల్లి యా కయ్య, స్టేషన్‌ఘన్‌పూర్‌కు శివునిపెల్లికి చెందిన మాసారపు భూపతిరావు, వరంగల్ కొత్తవాడకు చెందిన దేశిని ర మేశ్, జయశంకర్ భూపాలపెల్లి జిల్లా గోరుకొత్తపెల్లికి చెంది న శంకర్‌ను తమ ముఠాలో సభ్యులుగా చేర్చుకొని గుట్టుగా దందాను కొనసాగిస్తున్నారు.
ఆన్‌లైన్‌లోనే ఆర్డర్లు..
ముఠా సభ్యులు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల నుంచి సెల్‌ఫోన్ల ద్వారా గంజాయి ఆర్డర్స్ తీసుకుని నిందితుల్లో ఒకరైన నాయుడు ద్వారా వైజాగ్ నుంచి గంజాయిని దిగుమతి చేసేవారు. ఎవరికీ అనుమతి రాకుం డా బొలేరా వాహనంను ప్రత్యేకంగా రూపొందించుకొని ర హస్య ప్రదేశంలో గంజాయిని దాచి కస్టమర్లకు అందించేవారు. బానోతు వీరన్న, నాయుడు కస్టమర్ల నుంచి ఆన్‌లైన్‌లో ఖాతాలోకి డబ్బులు వేయించుకున్న తర్వాత మిగతా నిందితులు ప్రత్యేక వాహనంలో గంజాయిని సరఫరా చేసేవారు. ఈక్రమంలో పెద్దమొత్తంలో గంజాయి అక్రమ రవా ణా అవుతోందని ఎల్కతుర్కి ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్‌జీకి సమాచారం అందింది. ఈమేరకు టాస్క్‌ఫోర్స్ ఏసీపీ చక్రవర్తి, ఇ న్స్‌పెక్టర్ నందిరాంనాయక్, సబ్ ఇన్స్‌పెక్టర్లు శ్రీధర్, సూరి, ఉపేందర్ మండలకేంద్రంలోని హెల్త్‌సెంటర్‌లో వాహనాల తనిఖీలు చేస్తుండగా రెండు వాహనాల్లో రూ.30 లక్షల వి లువ చేసే గంజాయి తరలిస్తూ పట్టుబడ్డారు.

మొత్తం ఎనిమిది మంది ముఠా..
ముఠాలో మొత్తం ఎనిమిది మంది సభ్యులుండగా న లుగురు నిందితులను ఆదుపులోకి తీసుకొని వారి నుంచి రూ.30 లక్షల విలువ చేసే గంజాయితోపాటు రెండు కార్లు, నాలుగు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ రవీందర్ పేర్కొన్నారు. అరెస్టు అయిన వారిలో బొనగాని బిక్షపతి, జె ల్లి యాకయ్య, తీగల రాజు, మాసారపు భూపతిరావు ఉన్నారు. మరో నలుగురు నిందితులు బానోతు వీరన్న, నాయు డు, దేశిని రమేశ్, శంకర్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిం దితులపై పిడి యాక్టు నమోదు చేయడానికి పరిశీలిస్తున్నా మని పేర్కొన్నారు. ఈసందర్భంగా గంజాయిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన టాస్క్‌ఫోర్స్ ఇన్స్‌పెక్టర్ చక్రవర్తి, ఎల్కతుర్తి ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్‌జీ, టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ నందిరాంనాయక్, ఎల్కతుర్తి ఎస్సై శ్రీధర్, ముల్కనూర్ ఎస్సై టీవీఎన్ సూరి, వంగర ఎస్సై ఉపేందర్, హెడ్‌కానిస్టేబుల్ మల్లయ్య, కానిస్టేబుళ్లు తిరుపతి, రాజు, కిరణ్‌ను సీపీ ప్రత్యేకంగా అభినందించారు.

106
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...