డిగ్రీ పరీక్ష పేపర్ తారుమారు


Sun,May 19, 2019 02:30 AM

రెడ్డికాలనీ, మే 18: చదివిస్తే ఉన్న మతి పోయిన చందంగా కేడీసీ కళాశాల అధ్యాపకుల పనితీరుకు అద్దం పడుతుంది. విద్యార్థులకు మార్గదర్శకంగా ఉండాల్సిన అధ్యాపకులే తప్పటడుగులు వేస్తున్నారు. తప్పుల మీద తప్పులు చేస్తూ విద్యార్థుల జీవితాలను అందకారంలోకి నెట్టేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో కేయూ పరీక్షల అధికారుల తప్పిదం వలన ఓ విద్యార్థికి వందకు 150 మార్కులు వేసిన మరోసారి నెమరువేసుకున్నారు. ఇటీవల కేయూ డిగ్రీ పరీక్షలో నిర్వాహకులు సమయానికి రాకపోవడంతో గంట ఆలస్యంగా పరీక్షను నిర్వహించిన సంఘటనపై అధికారుల తప్పిదం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అలాంటి సంఘటన నుంచి విద్యార్థులు తేరుకోక ముందే మరో సంఘటన సంచలనంగా మారింది. ఎంతో పకడ్బందీగా పరీక్షలు నిర్వహించి విద్యార్థుల ప్రగతికి బాటలు వేయాల్సిన ఉపాధ్యాయులు ఒక పరీక్షా పేపరుకు బదులుగా మరో పరీక్షా పేపరు ఇచ్చి విద్యార్థులను ఆందోళనకు గురిచేసిన సంఘటన శనివారం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే...నగరంలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (కేడీసీ)లో డిగ్రీ 4వ సెమిస్టర్ సంస్కృతం పేపర్ గోల్‌మాల్ జరిగింది. శనివారం డిగ్రీ 4వ సెమిస్టర్ సెకండ్ లాం గ్వేజ్ పశ్నాపత్రాలకు బదులుగా ఈనెల 21న జరగాల్సిన పరీక్షా పత్రాల పేపర్(సెకండ్ సెమిస్టర్ సెకండ్ లాంగ్వేజ్)లను విద్యార్థులకు అందజేశా రు. పరీక్షా పత్రాలను చూసిన విద్యార్థులు ఆయోమయంలో పడ్డారు. పేపరు మారడంతో ఏం రాయాలో అర్థంకాని పరిస్థితి నెలకొంది. ఈ వి షయంపై ఇన్విజిలేటర్ల దృష్టికి తీసుకెళ్లడం అసలు విషయం బట్టబయలైంది. దీంతో కంగుతిన్న ఇన్విజిలెటర్లు, కేడీసీ ప్రిన్సిపాల్ అప్రమత్తమై విద్యార్థులకు పంపిణీ చేసిన పరీక్షా పత్రాలను తీసుకొని వెంటనే ఈ రోజు జరగాల్సిన పరీక్షా పత్రాలను విద్యార్థులకు అందజేశారు. ఈనెల 21న జరగాల్సిన మూడు పరీక్షా సెట్‌లలో లీక్ అయిన పరీక్షా పత్రాలను వెంట నే కేయూ పరీక్షల విభాగం అధికారులకు రిటన్ చేసినట్లు సమాచారం. ఆ రోజు జరగాల్సిన మూడు పరీక్షా సెట్‌లలో మిగతా రెండు సెట్ల నుంచి విద్యార్థులకు పరీక్ష పత్రాలను అందజేయనున్నట్లు తెలిసింది. ఈ విషయంపై కళాశాల ప్రిన్సిపాల్‌ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఫో న్‌లో అందుబాటులోకి రాలేదు.

113
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...