నిరుద్యోగులు స్వయం ఉపాధితో ఎదగాలి


Sun,May 19, 2019 02:30 AM

హసన్‌పర్తి, మే18: నిరుద్యోగులు స్వయం ఉపాధితో ఎదగి పది మందికి ఆదర్శంగా నిలవాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉ పాధి శిక్షణ సంస్థ డైరెక్టర్ హేమంత్‌కుమార్ అ న్నారు. మండల కేంద్రంలోని సంస్కృతి విహార్ ఎస్‌బీఐ ఆర్‌సెటీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో పరిస్థితులకు అనుగుణంగా యు వత సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని వ చ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నతంగా రాణించాలన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి శిక్షణ ద్వారా వివిధ కోర్సుల్లో శిక్షణ ఇచ్చి స్వయం ఉపాధి మార్గం వైపు నడిపించేందుకు ఎస్‌బీఐ ఆర్‌సెటీ సంస్థ కృషి చేస్తుందన్నారు. ఈ శిక్షణ ద్వారా నైపుణ్యాలను మెరుగుపర్చుకొని ఉన్నతంగా రాణించాలని నిరుద్యోగ యువతకు సూచించారు. ఈ నెల 20వ తేదీ నుంచి ఎస్‌బీఐ ఆర్‌సెటీలో నిరుద్యోగ యువతకు సెల్‌ఫోన్ సర్వీసింగ్, రిపేర్స్‌లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతానికి చెందిన వారు అర్హులని తెలిపారు. శిక్షణ కాలంలో ఉచిత భోజన, వసతి సౌకర్యంతో పాటు కోర్సు మెటీరియల్‌క కూ డా అందజేస్తామని తెలిపారు. 18నుంచి 45సంవత్సరాల వయస్సు కలిగి 10 ఆపై విద్యార్హత గల ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇతర వివరాలకు సెల్ 98493 07873, 97040 56522, 90591 08683నంబర్లలో సంప్రదించాలని కో రారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది బషీర్, కిశోర్, మనోహర్, సాగర్ తదితరులు పాల్గొన్నారు.

94
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...