ప్రముఖ హాస్య నాటక రచయిత బీవీ రమణమూర్తి అస్తమయం


Fri,May 17, 2019 03:19 AM

న్యూశాయంపేట, మే16: సహృదయ సాహిత్య సాం స్కృతిక సంస్థకు అత్యంత ఆప్తులు హాస్యనాటక రచ యిత బీవీ రమణమూర్తి గు రువారం తెల్లవారుజామున హైదరాబాద్‌లో కన్నుమూశారు. రమణమూర్తి మృతికి సహృదయ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్‌ ఎంవీ రాంగారావు, డాక్టర్‌ వీఎన్‌ చారి సంస్థ పక్షాన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. సహృదయతో ఎనలేని అనుబంధం ఉన్నదని నాటకోత్సవాలకు కాకినాడ నుంచి హజరుకావడమే కాకుండా ప్రతీ సంవత్సరం ఉత్తమ నాటక రచయిత పారితోషికం అందజేసేవారని వారు తెలిపారు. వనం లక్ష్మీకాంతారం, గిరిజామనోహరబాబు, పురుషోత్తమరావు మాట్లాడుతూ హాస్యనాటక రయిత బీవీ రమణమూరితో గల సుదీర్ఘ అనుభవం తమకు ఎన్నో అనుభూతులను మిగిల్చిందని సహృదయ అధ్యక్ష, కార్యదర్శులు అన్నారు. ఆనంద్‌ కుమార్‌ దర్శకత్వంలో ఆయన రచించిన ఉత్తరం, భరతనాట్యం వశీకరణం నాటికలు ప్రదర్శించినట్లు కుందావఝుల, కళా రాజశ్రీ తెలిపారు. హాస్యనాటక రయిత బీవీ రమణమూర్తి 1930 విజయనగరంలో జన్మించారు. ఉపాధ్యాయుడిగా కొంతకాలం పనిచేసి దక్షణమధ్య రైల్వేలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. హాస్యనాటక రయిత బీవీ రమణమూర్తి అనేక రేడియో, టీవీ నాటికల ద్వారా సునిశిత హస్యం పంచారు. వశీకరణం ఉత్తర వంటమనిషికావాలి, లీల, కళ్లజోడి, క్షణికం, నాటికలు మంచి పేరు తెచ్చిపెట్టాయి.

76
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...