మీటర్‌ రీడింగ్‌ నమోదులో జాప్యం


Fri,May 17, 2019 03:18 AM

-రెట్టింపు కరంటు బిల్లులతో వినియోగదారుల ఆందోళన
పోచమ్మమైదాన్‌, మే 16: గృహ అవసరాలకు వినియోగిస్తున్న కరంటు బిల్లులు పెరిగిపోతున్నాయని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. మీటర్‌ రీడింగ్‌ నమోదు చేసే కాంట్రాక్టు సిబ్బంది సకాలంలో రాకపోవ డంతో యూనిట్లు పెరిగిపోయి బిల్లులు రెట్టింపు అవుతున్నాయని కొత్తవాడ, తుమ్మలకుంట, ఆటోనగగర్‌, చార్‌బౌళి, నిజాంపుర ప్రాంతవాసులు వాపో తున్నారు. రీడింగ్‌ నమోదుకు ప్రతీనెల సిబ్బంది రావలసి ఉంది. సాధారణం గా ప్రతీనెల మొదటి వారంలో మీటర్‌ రీడింగ్‌ నమోదు చేసి, కరెంటు బిల్లుల చెల్లింపు స్లిప్పు ఇచ్చి వెళ్తుంటారు. అయితే దాదాపు రెండు మూడు నెలల నుంచి విద్యుత్‌ సిబ్బంది నెల పదిహేను రోజులు, రెండు నెలలకు ఒకసారి మీటర్‌ రీడింగ్‌ నమోదు చేస్తూ బిల్లులు ఇస్తున్నారు. గతంలో మాదిరిగా వా డుకున్న విద్యుత్‌ ప్రకారం రీడింగ్‌ బదులు యూనిట్లు ఎక్కువగా పెరగడంతో రెట్టింపు బిల్లులు చెల్లించాల్సి వస్తోందని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 50 యూనిట్లు, 100 యూనిట్లు, 150 యూనిట్ల మారిన ప్పుడు స్లాబ్‌ రేట్లు పెరుగుతుండంతో అధిక మొత్తంలో బిల్లులు చెల్లించాల్సి వస్తోందని పేర్కొన్నారు. దీంతో వాస్తవంగా రావలసిన బిల్లులు కన్నా రీడింగ్‌ పెరుగడంతో ఎక్కువగా బిల్లులు చెల్లిస్తూ నష్టపోవలసి వస్తోందని వాపో తున్నారు. రీడింగ్‌ విషయంలో అడిగితే సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రతీనెల సకాలంలో మీటర్‌ రీడింగ్‌ నమోదు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.

76
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...