టీబీ నిర్మూలనకు కృషి చేయాలి


Fri,May 17, 2019 03:18 AM

కాశీబుగ్గ, మే16: టి.బి. వ్యాది నిర్ములనకు ఆరోగ్య సిబ్బందితో పాటు ఆశకార్యకర్తలు కృషి చేయాలని జిల్లా టి.బి. నివారణ అధికారి డాక్టర్‌ మల్లిఖార్జున్‌ అన్నారు. గురువారం దేశాయిపేట్‌లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బందికి ఆశా కార్యకర్తలకు క్షయా వ్యాధి పై అవగాహణ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు లక్ష జనాభాలో సుమారు 215 మంది టి.బి.వ్యాధిగ్రస్తులు ఉంటున్నారని తెలిపారు. ఎవరికైన వారం రోజుల పాటు దగ్గు ఉన్నట్లు అయితే వెంటనే తెమడ పరీక్షలు చేయించి వ్యాధి నిర్థారణ అయిన తరువాత మందులు వాడే విదంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. టి.బి రహిత సమాజం కోసం సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని కొరారు. కార్యక్రమంలో మెడికల్‌ అఫీసర్‌ డాక్టర్‌ ప్రతాప్‌, ప్రియాంక, డిటిసి మెడికల్‌ అధికారి డాక్టర్‌ ప్రదీప్‌, టి.బి సిబ్బంది రమేష్‌, టివి శ్రీనివాస్‌, అంజమ్మ, గీతాంజలి, పబ్లిక్‌ హెల్త్‌ మెనెజర్‌ జన్ను కొర్నేల్‌ ఆశా కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...