‘ఐ గురు’ యాప్‌ ద్వారా ఎన్నో ఉపయోగాలు


Fri,May 17, 2019 03:17 AM

మట్టెవాడ, మే 16: విద్యావ్యవస్థలో ఐ గురు అప్లికేషన్‌ ఎంతో ఉపయోగకరంగా ఉందని ఐ గురు యాప్‌ ప్రతినిధి మంజులరెడ్డి అన్నారు. వరంగల్‌ సిటీగ్రాండ్‌ హోటల్‌లో గురువారం వివిధ పాఠశాలల, కళాశాలల యాజమాన్యాలకు ఈ అప్లికేషన్‌ గురించి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఈ అప్లికేషన్‌ ఒక సామాజిక కోణంతో తయారు చేసిందని ఇది మారుతున్న తరానికి అనుగుణంగా మరిన్ని సౌకర్యాలు కల్పించడం జరిగిందన్నారు. ఇందులో ముఖ్యంగా విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల పూర్తి కార్యక్రమాలను ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుంటుందన్నారు. ఇందులో హాజరు, బస్‌ సౌకర్యం, మార్కులు, పరీక్షల సమయం, టైం టేబుల్‌, ఫీజలు చెల్లింపు వివరాలు, అసైన్‌మెంట్స్‌ తదితర వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చన్నారు. విద్యావ్యవస్థకు సంబంధించిన వివరాలతో పాటు విద్యార్థులు, పేరెంట్స్‌, యాజమాన్యం ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందుకునే ఈ అప్లికేషన్‌ను రూపొందించడం జరిగిందని చెప్పారు. పతీ ఒక్క పాఠశాల, కళాశాల యాజమాన్యాలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్‌ హర్షవర్థన్‌ రెడ్డి, శాస్త్రి, మనోహర్‌, సాయికృష్ణ, ప్రభు, తుమ్మ ప్రభాకర్‌రెడ్డి, వివిధ పాఠశాల, కళాశాలల యాజమాన్యం పాల్గొన్నారు.

90
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...