17నుంచి పాలిసెట్‌ కౌన్సెలింగ్‌


Thu,May 16, 2019 03:15 AM

-స్లాట్‌ బుకింగ్‌ ఆధారంగా కౌన్సెలింగ్‌ ప్రక్రియ నిర్వహణ
-జిల్లాలో నాలుగు హెల్ప్‌ లైన్‌ సెంటర్లు
మట్టెవాడ, మే 15: ప్రభుత్వ, ప్రైవేట్‌, ఎయిడెడ్‌ పాలిటెక్నిక్‌లలో ప్రవేశం కోసం నిర్వహించిన పాలిసెట్‌ ర్యాంకుల ఆధారంగా కౌన్సెలింగ్‌ ప్రక్రియను ఈ నెల 17 నుంచి నిర్వహించనున్నట్లు వరంగల్‌ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ బైరి ప్రభాకర్‌ తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గతంలో కంటే భిన్నంగా ర్యాంకుల వారీగా కాకుండా స్లాట్‌ బుకింగ్‌ ఆధారంగా కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. వరంగల్‌ అర్బన్‌, రూరల్‌ జిల్లాలకు కలిసి కాకతీయ డిగ్రీ కళాశాల, కాకతీయ విశ్వవిద్యాలయం, ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల, వరంగల్‌ ప్రభుత్వ పాలిటెక్నిక్‌, జయశంకర్‌భూపాల్‌పల్లి జిల్లాలోని భూపాల్‌పల్లి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జనగామ జిల్లాకు జనగామ పట్టణంలోని ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మహబూబాబాద్‌ జిల్లాకు మహబూబాబాద్‌ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ కౌన్సెలింగ్‌ ఉంటుందని తెలిపారు. అయితే ఈ నెల 17 నుంచి 19వరకు నెట్‌ సెంటర్లు కాని ఇంటర్‌నెట్‌ల ద్వారా హాజరయ్యే సెంటర్‌, టైంకు కౌన్సెలింగ్‌లో పాల్గొంటారో దాని విద్యార్థులు ఆధారంగా స్లాట్‌ బుక్‌ చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రతీ సెంటర్‌లో మొదటి సెషన్‌ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రెండో సెషన్‌ మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కౌన్సెలింగ్‌ ఉంటుందని తెలిపారు.
18నుంచి 21వరకు స్లాట్‌ బుక్‌ చేసుకున్న వారు ఆయా సెంటర్‌లో హాజరై సర్టిఫికెట్స్‌ వెరిఫికేషన్‌ చేయించుకోవాల్సి ఉంటుందని చెప్పారు. 18నుంచి 24వరకు ఆప్షన్స్‌ ఎంటర్‌ చేసుకోవడం, 27న సీట్ల కేటాయింపు, జూన్‌ 1వరకు తరగతులు ప్రారంభమయ్యేలా ఈ కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఉంటుందని వరంగల్‌ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ ప్రిన్సిపాల్‌ తెలిపారు.

86
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...