అవగాహనతోనే సమస్యలకు పరిష్కారం


Thu,May 16, 2019 03:15 AM

-జిల్లా న్యాయ సేవాధికార సంస్థ
-వరంగల్‌ కార్యదర్శి జె.విక్రమ్‌
హసన్‌పర్తి, మే 15: ప్రతి యువత చట్టాలపై అవగాహన కలిగి ఉంటే ఏ సమస్యలకైనా న్యా యపరంగా పరిష్కరించుకోవచ్చని వరంగల్‌ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జె. విక్రమ్‌ అన్నారు. మండల కేంద్రంలోని సంస్కృతి విహార్‌ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ కార్యాలయం సమావేశ మందిరంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సును జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాం గం ప్రకారం చట్టం ముందు అందరు సమానులేనని పాలన అనేది సమన్యాయంగా ఉండాలన్నారు. ఎలాంటి వివాదాలు, సమస్యలు వచ్చినా జిల్లా న్యాయ సేవా సంస్థను సంప్రదించి న్యాయం పొందవచ్చని చెప్పారు. స్వయం ఉపాధి శిక్షణలో మెళకువలను నేర్చుకొని సమాజంలో ఉన్నత వ్యక్తిగా గుర్తింపు పొందాలన్నారు. తమకు తెలిసిన జ్ఞానాన్ని ఇతరులతో పంచుకోవాలని తెలిపారు. ఎటువంటి సమస్యలకైనా న్యాయసేవాధికార సంస్థలను ఆశ్రయించి న్యాయపరంగా సమస్యలను సాధించుకోవచ్చన్నారు. అ నంతరం న్యాయ సేవాధికార సంస్థల విధులు-లక్ష్యాలను, భవన నిర్మాణ కార్మికులకు వర్తించే సంక్షేమ పథకాలు, షెడ్యూల్డు తెగల వారికి వర్తిం చే సంక్షేమ పథకాలను గురించి క్షుణ్ణంగా వివరించారు. సదస్సులో న్యాయవాదులు సురేశ్‌, పూస శ్రీనివాస్‌, ఎ.సందీప్‌, ఎస్‌బీఐ ఆర్‌సెటీ డైరెక్టర్‌ ఎస్‌.హేమంత్‌కుమార్‌తో పాటు 22 మంది శిక్షణ అభ్యర్థులు పాల్గొన్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...