అనుమానంతో అత్త, భార్యపై గొడ్డలితో దాడి


Thu,May 16, 2019 03:14 AM

రేగొండ, మే 15 : వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో మండలంలోని చెన్నాపూర్‌ గ్రామం లో అత్త ఒన్నాల లక్ష్మి (65), భార్య సుజాతపై ఆమె భర్త అల్లె ప్రభాకర్‌ మంగళవారం అర్ధరాత్రి గొడ్డలితో దాడి చేశాడు. ఈ ఘటనలో అత్త లక్ష్మి అక్కడికక్కడే మృతి చెందగా, భార్య సుజాత పరిస్థితి విషమంగా ఉంది. రేగొండ ఎస్సై నాగపూరి సదాకర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని చెన్నాపూర్‌ గ్రా మానికి చెందిన అల్లె ప్రభాకర్‌ అదే గ్రామానికి చెందిన సుజాతతో 18 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వారికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కాగా, రెండు సంవత్సరాల నుంచి భార్య సుజాతకు గ్రా మంలో వివాహేతర సంబంధాలు ఉన్నాయంటూ అనుమానం పెంచుకున్నాడు. దీంతో ఆమెతో తరుచూ గొడవ పడుతూ శారీరకంగా హింసించేవాడు.

ఈక్రమంలో మద్యానికి బానిసయ్యాడు. పలుమార్లు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ కూడా నిర్వహించుకున్నారు. వారం రోజల క్రితం చిత్రహింసలకు గురి చేయడంతో బాధలు భరించలేక ఇదే గ్రా మంలో ఉంటున్న తన తల్లిగారింటికి సుజాత వెళ్లింది. మూడు రోజల క్రితం ప్రభాకర్‌ అత్తగారింటికి వచ్చి భార్యను కాపురానికి రావాలని కోరాడు. మనస్తాపం చెందిన సుజాత వెళ్లడానికి నిరాకరించింది. దీంతో పథకం ప్రకారం ప్రభాకర్‌ ఆదివారం మ ద్యం తాగి గొడ్డలి తీసుకుని అత్తగారింటికి అర్ధరాత్రి వెళ్లాడు. మొదటగా అత్త లక్ష్మిపై గొడ్డలితో దాడి చేశా డు. ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. తర్వాత భార్య సుజాతపై దాడి చేసి మెడపై నరికాడు. దీంతో సుజాత గొంతుకు గాయమై రక్త మడుగులో పడి అరవడంతో చుట్టుపక్కల వారు వచ్చారు. వారు రావడాన్ని గమనించి ప్రభాకర్‌ పరారయ్యాడు. గాయాలపాలైన సుజాతను ఎంజీఎంకు తరలించారు. కాగా, ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మృతురాలి కొడుకు మల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న చిట్యాల సీఐ శ్రీనివాస్‌ ఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

103
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...