ఇంటర్నేషనల్‌ఎక్సలెన్సీ అవార్డుకు


Thu,May 16, 2019 03:14 AM

-గౌరు తిరుపతిరెడ్డి ఎంపిక
హసన్‌పర్తి, మే 15: మండలంలోని పెంబర్తి ఏకశిల విద్యా సంస్థల చైర్మన్‌ గౌరు తిరుపతిరెడ్డి ఇంటర్నేషనల్‌ ఎక్సలెన్సీ అవార్డుకు ఎంపికైనట్లు కల్చరల్‌ యాక్షన్‌ ఫర్‌ లిటరసీ అండ్‌ అవేర్‌నెస్‌ (కాలా) స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ కందుకూరి విజయ్‌మోహన్‌ ప్రకటించారు. కాలా స్వచ్ఛంద సేవా సంస్థ 35వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర స్థాయి అవార్డుల్లో భాగంగా మండలంలోని నాగారం గ్రామానికి చెందిన తిరుపతిరెడ్డి విద్యా రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్నందుకు, పలు సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు రక్తదాన శిబిరాలు నిర్వహించుటలో చురుకైన పాత్ర పోషిస్తున్నాడు. ఈ నెల 31న త్యాగరాయ గాన సభ హైదరాబాద్‌లో ఈ అవార్డును కేంద్ర, రాష్ట్ర స్థాయి ప్రముఖుల చేతుల మీదుగా అందజేస్తారని వారు చెప్పారు. తిరుపతిరెడ్డి 2002 నుంచి 2005 వరకు వరుసగా నాలుగుసార్లు ప్రతిభా పురస్కారం అవార్డును, 2012లో కలెక్టర్‌ చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, 2015లో తెలంగాణ ప్రభుత్వంచే ఉత్తమ సేవా పురస్కారం అవార్డు, 2016లో మంత్రి తన్నీరు హరీష్‌రావు చేతుల మీదుగా అబ్దుల్‌ కలాం పురస్కార్‌ అవార్డును, 2017లో ఏకశిల చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా అనేక రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. గవర్నర్‌ చేతుల మీదుగా ఉత్తమ రక్తదాత అవార్డును, 2018లో కేంద్ర మానవ వనరుల అభివృద్ధ్ది శాఖ వారిచే స్వచ్‌ విద్యాలయ అవార్డును అందుకున్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...