అదృశ్యమైన బాలిక ఆచూకీ లభ్యం


Thu,May 16, 2019 03:12 AM

-ఫిర్యాదు అందిన ఏడు గంటల్లోనే గుర్తించిన రైల్వే పోలీసులు
-తల్లిదండ్రులకు అప్పగింత
ఖిలావరంగల్‌, మే 15: పదో తరగతి పరీక్షలో జీపీఏ తక్కువగా వచ్చిందని ఓ బాలిక మనస్థాపంతో ఆత్మహత్య చేసుకునేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లింది. చివరి సారిగా బాలికను వరంగల్‌ రైల్వేస్టేషన్‌లో గుర్తించడంతో తల్లిదండ్రులు వరంగల్‌ రైల్వే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో రైల్వే పోలీసులు రెండు బృందాలుగా విడిపోయి కేవలం ఏడు గంటల్లోనే విద్యార్థినిని గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. బుధవారం వరంగల్‌ రైల్వే పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాలి క వివరాలను వరంగల్‌ రైల్వే సీఐ వినయ్‌కుమార్‌ వె ల్లడించారు. ఆయన కథనం ప్రకారం... హన్మకొండ కాపువాడకు చెందిన జీలకర సాత్విక (16) ఎల్కతుర్తి గురుకుల పాఠశాలలో పదవ తరగతి పూర్తి చేసింది. 13వ తేదీన ఫలితాల్లో తనకు 8.2 జీపీఏ రావడంతో తీవ్ర మనస్థాపానికి గురైంది. దీంతో ఎవరికి చెప్పకుండా ఆత్మహత్య చేసుకుందామని వరంగల్‌ రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. రైల్వేస్టేషన్‌లో ఓ ప్ర యాణికుని మొబైల్‌ ఫోన్‌తో సాత్విక తమ ఇంటి స మీపంలోని బాబు అనే వ్యక్తితో మాట్లాడి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పింది. బాబు వెంటనే స్పందిం చి బాలిక తల్లిదండ్రులకు సమాచారం చేరవేశారు.

దీంతో తల్లిదండ్రులు రైల్వేస్టేషన్‌కు చేరుకొని సీసీ కెమెరాల పుటేజీని పరిశీలించగా, అందులో సాత్విక కనిపించింది. సాత్విక తండ్రి శ్రీనివాస్‌ మంగళవారం ఉదయం 11.30 గంటలకు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెం టనే పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి విచారణ చేపట్టారు. సాత్విక మొదటగా ఫోన్‌ చేసిన బాబు ద్వారా వివరాలు సేకరించారు. ఈ క్రమంలో బాలిక కాజీపేట రైల్వేస్టేషన్‌లో షిర్డీ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఎక్కింది. గుర్తు తెలియని ప్రయాణికుని మొబైల్‌ ఫోన్‌ ద్వారా సమీప బంధువుతో మాట్లాడింది. ఈ క్రమంలో పోలీసులు సమీప బంధువు కు వచ్చిన ఫోన్‌ నంబర్‌కు కాల్‌ చేసి సాత్విక ఇంటి నుంచి పారిపోయిన విషయాన్ని వివరించారు. సాత్వికకు ఎలాంటి అనుమానం రాకుం డా మాటల్లో పెట్టి సికింద్రాబాద్‌ వరకు తీసుకురావాలని సదరు ప్రయాణికుడికి సూచించారు. సికింద్రాబాద్‌లో రైల్వే పోలీసుల సహకారంతో సాయంత్రం 6.30 గంటలకు సాత్వికను గర్తించి, అ క్కున చేర్చుకున్నారు. విద్యార్థినిని వరంగల్‌ రైల్వేస్టేషన్‌కు తీసుకువచ్చి కౌన్సిలింగ్‌ ని ర్వహించి తల్లిదండ్రులకు అప్పగించినట్లు సీఐ తెలిపారు. అయితే బాలిక 13వ తేదీన గుర్తు తెలియని రైలు ద్వారా జనగామ, సికింద్రాబాద్‌ మధ్యలోని ఓ రైల్వేస్టేషన్‌కు చేరుకొని ఆ రాత్రి ప్లాట్‌ఫాంపై పడుకుంది. మరుసటి రోజు 14వ తేదీన ఆకలి బాధ భరించలేక అక్కడి నుంచి కాజీపేట రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. తిరిగి షిర్డీ ఎక్స్‌ప్రెస్‌ ద్వారా సికింద్రాబాద్‌కు వెళుతున్న క్రమంలో పట్టుకున్నారు. కేవలం ఏడు గంటల వ్య వధిలోనే జీఆర్పీ, ఆర్పీఎఫ్‌ పోలీసుల సహకారంతో బాలికను గుర్తించి తల్లిదండ్రుల కు అప్పగించినట్లు సీఐ తెలిపారు. సమావేశంలో ఆర్పీఎఫ్‌ సీఐ ఎం రవిబాబు, జీఆర్పీ ఎస్సై పరశురాములు, ఆర్పీఎఫ్‌, జీఆర్పీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

73
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...