మెజార్టీ వ్యూహం


Wed,May 15, 2019 03:20 AM

*స్థానిక’ మంత్రాంగం
-పోచంపల్లిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలి
-విజయం మనందరి లక్ష్యం..
-పోచంపల్లి గెలుపు..ప్రగతికి మలుపు
-పార్టీ కన్నా ఎవరూ అతీతులు కాదు
-ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
- ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలతో సమీక్ష
వరంగల్‌ ప్రధాన ప్రతినిధి-నమస్తే తెలంగాణ: వరంగల్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాన్ని భారీ మెజార్టీతో గెలిపించుకోవడం టీఆర్‌ఎస్‌ తక్షణ లక్ష్యం. ఒక్క ఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సారథ్యంలో ఎమ్మెల్యేలు, వారికి అన్ని విధాలుగా తోడ్పాటును అందించేందుకు ఇన్‌చార్జీలను నియమించారు. వరంగల్‌ ఉమ్మడి జిల్లాలోని ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, పరకాల, నర్సంపేట, భూపాలపల్లి నగర పంచాయతీల్లోని వార్డు మెంబర్లు, జ నగామ, మహబూబాబాద్‌ మున్సిపాలిటీల్లోని కౌ న్సిలర్లు, మహానగర పాలక సంస్థ పరిధిలోని కా ర్పొరేటర్లు మొత్తం 918 మంది ఓటర్లు ఉన్నారు.

సమన్వయ సమీక్ష
టీఆర్‌ఎస్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించేందుకు టీఆర్‌ఎస్‌ వ్యూహరచన చేస్తుంది. అందులో భాగంగా హరిత హోటల్‌లో మంగళవారం సాయంత్రం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఉమ్మడి వరంగల్‌ జిల్లా ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. నియోజకవర్గాల వారీగా ఉన్న ఓటర్లు వారి స్థితిగతులు మొదలైన అంశాలపై సమీక్షించారు. ప్రజల్లో టీఆర్‌ఎస్‌ పార్టీకున్న బలం, స్థానిక ప్రజా ప్రతినిధులపై ఉన్న అభిమానం, స్థానిక ప్రజాప్రతినిధులందరూ అనుసరించాల్సిన వ్యూహం మొదలైన అంశాలపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు నియోజకవర్గాల వారీగా సమీక్షించారు. ఎమ్మెల్యేలు వారి వారి నియోజకవర్గాల్లో ఉన్న ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, వార్డు మెంబర్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఇలా ఓటర్ల వివరాలను నివేదిస్తూ పార్టీ నిర్ణయాన్ని శిరసావహించే విధంగా మలుచుకోవడంలో ఎమ్మెల్యేలు కీలక పాత్ర పోషించాలని మంత్రి సూచించారు. మాజీ మంత్రులు అజ్మీరా చందూలాల్‌, బస్వరాజు సారయ్య, ఎంపీ బండా ప్రకాశ్‌, ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్‌, నన్నపునేని నరేందర్‌, చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి, శంకర్‌నాయక్‌, డాక్టర్‌ టీ రాజయ్య, నారదాసు లక్ష్మణ్‌రావు, కార్పొరేషన్‌ చైర్మన్లు వాసుదేవారెడ్డి, కన్నెబోయిన రాజయ్యయాదవ్‌, గుండు సుధారాణి, లింగంపల్లి కిషన్‌రావు, వరంగల్‌ నగర మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు, కుడా చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి, కొమురవెల్లి దేవస్థానం చైర్మన్‌ సంపత్‌, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఎడవెల్లి కృష్ణారెడ్డి, రైతు సమన్వయ సమితి కన్వీనర్‌ లలితాయాదవ్‌, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల నరేశ్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు కరిమిల్ల బాబురావు, హరిరమాదేవి, ఇండ్ల నాగేశ్వర్‌రావు, సాంబారి సమ్మారావు, జన్ను జకార్య, మార్నేని రవీందర్‌రావు తదితర నాయకులు సమీక్షలో పాల్గొన్నారు.

పోచంపల్లి గెలుపు..ప్రగతికి మలుపు
పార్టీ ఆవిర్భావం నుంచి నాడు ఉద్యమంలో నేడు పార్టీ నిర్మాణంలో కీలక భూమిక పోషించిన యువనాయకుడు, సీఎం కేసీఆర్‌ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు, వరంగల్‌ రూరల్‌ జిల్లా నడికూడ మండలం వరికోల్‌ గ్రామానికి చెందిన పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డిని సీఎం కేసీఆర్‌ వరంగల్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడంతో పార్టీలో హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి. వరికోల్‌ గ్రామాన్ని ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దడమే కాకుండా రాష్ట్రంలో ఈ గ్రామానికి ప్రత్యేకతలు ఆపాదించారు. అంతేకాకుండా పార్టీ నిర్మాణంలో తెరవెనుక సూత్రదారులుగా ఉంటూనే ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో అందరూ ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజా ప్రతినిధులతో సన్నిహిత సంబంధాలు మొదటి నుంచి కొనసాగిస్తూ వస్తున్నాడు. పోచంపల్లి పార్టీకి చేసిన సేవలకు గుర్తింపుగా ఆయనకు ఎమ్మెల్సీ టికెట్‌ ఇవ్వడం, పార్టీలో అన్ని స్థాయిల్లో ఆనందం వెల్లువెత్తింది. ఇంతకాలం పార్టీ నిర్మాణంలో సైనికుడిగా పనిచేసిన పోచంపల్లి రేపు ఉమ్మడి వరంగల్‌ జిల్లా అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తారని అందరితో కలివిడిగా ఉంటూ జిల్లా అభివృద్ధికి తనకున్న పరిచయాలతో తోడ్పాటును అందిస్తారని ఆయనపై ఆశలు స్థానిక ప్రజాప్రతినిధుల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ నాయకులందరూ ఎవరికి తోచిన విధంగా వారు పోచంపల్లి గెలుపుకోసం క్రియాశీలకంగా పనిచేయాలని మంత్రి సూచించారు.

పార్టీ నిర్ణయాన్ని శిరసావహించాల్సిందే
టీఆర్‌ఎస్‌ క్రమశిక్షణకు మారుపేరుగా ఉంది. ఈ తరుణంలో వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికలను అదే క్రమశిక్షణాయుత వాతావరణంలో నిర్వహించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సూచించారు. నియోజకవర్గాల వారీగా ఉన్న ఓటర్లు ఆ ఓటర్లకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందుబాటులో ఉంచుకోవడమే కాకుండా ఓటర్లు పార్టీ విధి విధానాలకు కట్టుబడి ఉండే లా తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మంత్రి సూచించారు. అంతేకాకుండా ఎవరైనా పార్టీ నిర్ణయానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కొంతమంది ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు తాము వేరని భావిస్తూ నడుచుకుంటున్నట్లు పార్టీకి సమాచారం ఉందన్నారు. అటువంటి వారిని ఉపేక్షించమని భవిష్యత్‌ అంతా టీఆర్‌ఎస్‌దేనని, అక్కడక్కడ దురాలోచనతో ఉన్నవారు పద్ధతిమార్చుకోవాలని లేకుంటే పార్టీ మార్పు చేస్తుందని ఆయన హెచ్చరించారు. నియోజకవర్గంలో ఉన్న ఏ ఒక్క ఓటరు వేరే ఇతరేతర ఆలోచనలకు వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలు ఆ ఎమ్మెల్యేలకు తోడ్పాటునందించేందుకు వేసిన ఇన్‌చార్జీలదేనన్నారు. అందరికీ అందరం సమష్టి భాగస్వామ్యంతో పార్టీ నిర్ణయాన్ని శిరసావహించాలని సూచించారు. అదే క్రమంలో పార్టీకున్న బలం, సీఎం కేసీఆర్‌ తీసుకునే నిర్ణయాలు, ప్రజల్లో ఉన్న ఆదరణ వెరసి టీఆర్‌ఎస్‌ పార్టీదే భవిష్యత్‌ అని ఆయన పేర్కొన్నారు. ఇటువంటి తరుణంలో పార్టీ కోసం కష్టపడ్డ వాళ్లలో పార్టీ ఎప్పుడూ గుర్తుంచుకుంటుందని సందర్భం వచ్చినప్పుడు వారి సేవలను వినియోగించుకుంటూనే అవకాశం వచ్చినప్పుడు వారికి తగిన ప్రోత్సాహకాలు అందిస్తామని భరోసా ఇచ్చారు.

టీఆర్‌ఎస్‌కు టచ్‌లో కాంగ్రెస్‌ ‘స్థానిక’ ప్రజాప్రతినిధులు
వరంగల్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓటర్లు 918 (అయితే ఈ సంఖ్యలో మార్పు ఉంటుంది, మరణించిన వాళ్లు, తమ తమ పదవులకు రాజీనామా చేసిన వాళ్లు ఉన్నారు. ఈ తుది జాబితా రేపో ఎల్లుండో వెలువడనున్నది). ఇందులో టీఆర్‌ఎస్‌ పార్టీకి 719మంది ఓటర్లు ఉన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి 171మంది ఓటర్లు ఉన్నారు. మిగతా ఇతరులు. అయితే కాంగ్రెస్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన ఇనగాల వెంకట్రామిరెడ్డి వైపు ఎంత మంది ఉంటారు, ఆ పార్టీలో ఉన్న సమన్వయ లోపం, సారథ్య రాహిత్యం, కుమ్ములాటలు, ఏకతాటిపై తెచ్చే నాయకుడు లేకపోవడం వంటి సమస్యలతో కొట్టుమిట్టాడుతుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, కౌన్సిలర్లు, జెడ్పీటీసీల్లో దాదాపు సగానికిపైబడి టీఆర్‌ఎస్‌కు టచ్‌లో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హరిత హోటల్‌లో జరిగిన సమీక్షలో మండలాల నుంచి కాంగ్రెస్‌ పార్టీకి చెందిన, ఇతర పార్టీలకు చెందిన తమకు టచ్‌లోకి వచ్చారని పేర్కొనడం అది మరింత బలాన్ని చేకూరుస్తుంది. మొత్తంగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి గెలుపు ఖాయమైందని భారీ మెజార్టీయే లక్ష్యంగా ముందుకుసాగుతుంది.

123
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...