బెస్ట్‌ అవైలబుల్‌ స్కీంకు నోటిఫికేషన్‌ జారీ


Wed,May 15, 2019 03:18 AM

అర్బన్‌ కలెక్టరేట్‌, మే14: జిల్లాలో బెస్ట్‌ అవైలబుల్‌ పథకం ద్వారా 2019-20 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకుగాను కలెక్టర్‌ ప్రశాంత్‌జీవన్‌ పాటిల్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఈ స్కీం ద్వారా వరంగల్‌ అర్బన్‌ జిల్లాకు చెందిన 15మంది గిరిజన విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తారని తెలిపారు. 3వ తరగతి, 5వ, 8వ తరగతులలో ప్రవేశాలు కల్పిస్తారని, అసక్తి, అర్హత ఉన్న జిల్లాలోని గిరిజన విద్యార్థులు ఈ నెల 25వ తేదీ సాయంత్రం 5గంటలలోగా జిల్లా గిరిజిన అభివృద్ధి అధికారి వరంగల్‌ అర్బన్‌ జిల్లా కార్యాలయంలో అందజేయాలన్నారు. దరఖాస్తు వెంట మీసేవ ద్వారా పొందిన కులం, ఆదాయం, స్టడీ సర్టిఫికెట్ల ప్రతులను ఆయా మండలంలోని ఎవరైన గెజిటెడ్‌ అధికారిచే అటెస్టేషన్‌ చేయించి జతచేయాలన్నారు. అలాగే, కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతంలో రూ.1.50లక్షలు, పట్టణ పరిధిలో రూ.2లక్షలకు మించరాదన్నారు. ఈ స్కీంలో ఒక కుటుంబం నుంచి ఒక్కరికి మాత్రమే అర్హత ఉంటుందని చెప్పారు. ఈ నిబంధన బాలికలకు వర్తించదని ఆ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ఫారం హన్మకొండ అశోక్‌నగర్‌ అంబేద్కర్‌భవన్‌ సమీపంలో ఉన్న జిల్లా గిరిజన అభివృద్ధి కార్యాలయంలో ఉచితంగా అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. గతంలో మాదిరిగా ఈ సంవత్సరం కూడా లాటరీ పద్ధతిన ఎంపిక జరుగుతుందని కలెక్టర్‌ వెల్లడించారు.

82
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...