పోగొట్టుకున్న నగదు అప్పగించిన ఔట్‌పోస్టు సిబ్బంది


Wed,May 15, 2019 03:18 AM

వరంగల్‌ చౌరస్తా, మే14: వైద్య పరీక్షల కోసం దవాఖానాకు వచ్చి నగదును పోగొట్టుకున్న మహిళకు వరంగల్‌ సీకేఎం ఔట్‌పోస్టు సిబ్బంది నగదును కనుగొని తిరిగి అప్పగించారు. వివరాలు.. శివనగర్‌ ప్రాంతానికి చెందిన స్వాతి వైద్యపరీక్షల నిమిత్తం వరంగల్‌ సీకేఎం దవాఖానలో వైద్యులను సంప్రదించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు స్కానింగ్‌ నిర్వహించాలని సూచించారు. దీంతో స్కానింగ్‌ పరీక్షల నిమిత్తం ఓపీ విభాగంలో నమోదు చేయించుకోవడానికి క్యూలో నిల్చుంది. డాక్టర్లు సూచించిన మందుల చిట్టిని కౌంటర్‌లో ఇచ్చేందుకు తన వద్దనున్న సంచిలో నుంచి బయటకు తీస్తుండగా నగదుసంచి కిందపడిపోయింది. నగదు జారవిడుచుకున్న విషయాన్ని గుర్తించిన బాధిత మహిళ ఔట్‌పోస్టు సిబ్బందికి విషయం తెలిపింది. దీంతో సీసీ కెమెరాల ఆధారంగా కాశీబుగ్గ ప్రాంతానికి చెందిన రాజేశ్‌ అనే యువకుడికి దొరికినట్లు గుర్తించారు. అనంతరం అతడినుంచి పోగొట్టుకున్న రూ. తొమ్మిది వేల నగదును తిరిగి అప్పగించారు. నగదు పోగొట్టుకున్న రెండు గం టల వ్యవధిలోనే కనుగొని బాధితురాలికి అప్పగించడంతో ఔట్‌సోస్టు సిబ్బంది హెడ్‌ కానిస్టేబుల్‌ కు మారస్వామి, కానిస్టేబుల్స్‌ అమరేందర్‌, రఘుపతి, రమేశ్‌ను ఉన్నతాధికారులు అభినందించారు.

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...