కార్మికులకు డబ్బులు వాపస్‌ ఇస్తాం..!


Wed,May 15, 2019 03:18 AM

-విచారణాధికారికి రాతపూర్వకంగా హామీ
పోచమ్మమైదాన్‌, మే 14: చేనేత కార్మికుల రుణా ల మాఫీ పథకంలో వసూలు చేసిన డబ్బులను తిరి గి ఇవ్వడానికి దళారులు ముందుకు వచ్చినట్లు తె లుస్తుంది. ఈమేరకు నలుగురు మధ్యవర్తులు విచారణాధికారికి రాతపూర్వకంగా హామీ ఇచ్చినట్లు స మాచారం. వరంగల్‌ కొత్తవాడ కార్మికులకు మం జూరైన చేనేత రుణాల మాఫీలో చోటుచేసుకున్న అ వకతవకలపై సోమవారం ఉదయం స్థానిక షతరంజి మట్టెవాడ చేనేత సహకార సంఘం (పెద్ద సం ఘం)లో విచారణ జరిగిన విషయం విధితమే. ఈ సందర్భంగా కార్మికులకు సంబంధంచిన రుణాల మాఫీలో దళారులతోపాటు అధికారులు పాత్రపై ఆ రా తీశారు. సుమారు 94 మంది చేనేత కార్మికులు విచారణాధికారి రీజినల్‌ డిప్యూటీ డైరెక్టర్‌ తస్నీమ్‌ అతర్‌ జహాకు వాంగ్మూలం ఇచ్చారు. ఇదే క్రమం లో దళారులుగా భావిస్తున్న నలుగురు వ్యక్తులను కూడా ఆమె విచారించారు. ఏడీ కార్యాలయానికి వచ్చిన వారు తాము చేనేత కార్మికుల నుండి రుణమాఫీ విషయంలో డబ్బులు తీసుకున్నట్లు అంగీకరించినట్లు తెలుస్తుంది. అయితే వారు చెప్పినట్లుగా కాకుండా తాము కొంతమేరకు డబ్బులు వసూలు చేశామని, ఇట్టి డబ్బులు తిరిగి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే డబ్బులు వసూలు చేయడం సరైన పద్ధతి కాదని, దీనిపై క్రిమినల్‌ కేసు లు కూడా పెట్టాల్సి వస్తుందని ఆమె మందలించిన ట్లు సమాచారం. చివరకు వారు తాము తీసుకున్న డబ్బులను నాలుగైదు రోజుల్లో తిరిగి ఇస్తామంటూ రాతపూర్వకంగా రాసి ఇచ్చినట్లు సమాచారం. మిగిలిన ఇద్దరి నుండి కూడా చేనేత కార్మికులకు డబ్బు లు ఇప్పిస్తామంటూ చెప్పినట్లు తెలుస్తోంది. ఇంత కూ దళారులు తీసుకున్న డబ్బులను చేనేత కార్మికులకు వాపస్‌ ఇస్తే ఎంతో మేలు చేసినట్లవుతుంద ని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...