సత్తాచాటిన సర్కార్‌ బడి..


Wed,May 15, 2019 03:18 AM

-టెన్త్‌లో వందశాతం ఉత్తీర్ణతసాధించిన బొల్లికుంట ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు
-అభినందించిన ఉపాధ్యాయ బృందం
వరంగల్‌, నమస్తేతెలంగాణ: ఐదో డివిజన్‌ బొల్లికుంటలోని జిల్లా ప్రజాపరిషత్‌ సెకండరీ పాఠశాల విద్యార్థులు ప్రైవేట్‌ పాఠశాలలకు దీటుగా టెన్త్‌ ఫ లితాల్లో సత్తాచాటారు. వందశాతం ఉత్తీర్ణత సాధించారని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆనంద్‌బా బు తెలిపారు. జీ సాయిచరణ్‌, జీ కార్తీక్‌ 9.8 జీపీఏ, కే నిహారిక, బీ నాగరాజు 9.7, బీ రుచిత 9.5 సాధించారని తె లిపారు. అంతేగాక ఇద్దరు వి ద్యార్థులు 9.3, ఐదుగురు 9.2, ఇద్దరు 9.0 జీపీఏ సాధించారన్నారు. ఈ నేపథ్యంలో మంగళవా రం హెచ్‌ఎం అధ్యక్షతన పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రతిభ కనబర్చిన విద్యార్థుల ను ఉపాధ్యాయ బృందం జ్ఞాపికలను అందించి అ భినందించింది. కార్య్ర మంలో ఎస్‌ఎంసీ చైర్మన్‌ కే కుమారస్వామి, ఉపాధ్యాయులు రవి, రాజేశ్వర్‌రా వు, కటకం రఘు, అశోక్‌కుమార్‌, శివాజీ, భాస్కర్‌, సాంబమూర్తి, సఖిల్‌, ప్రవీణ్‌, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

81
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...