కాంగ్రెస్‌ స్థానిక ప్రజాప్రతినిధుల్ని అవమానించింది


Wed,May 15, 2019 03:17 AM

- పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి
కాంగ్రెస్‌ పార్టీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను అడ్డుకోవాలని కోర్టుకు వెళ్లిందని, ఈ చర్యతో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల్ని అవమానించిందని ఎమ్మెల్సీ అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌కు ఆ పార్టీపై నమ్మకం లేదని, ఆ పార్టీ గుర్తుతో గెలిచిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్లు, కార్పొరేటర్లపై విశ్వాసం లేదని ఒకవైపు ఎన్నికలు ఆపాలని కోర్టుల్ని ఆశ్రయించి, అవే ఎన్నికల్లో పోటీచేస్తోందన్నారు. ఒకవైపు ఎన్నికలు ఆడ్డుకోవడటం, మరోవైపు అదే ఎన్నికల్లో పోటీచేయడంలాటి పిచ్చి చేష్టలతో పార్టీ ఉనికికే ప్రమాదం అన్న విషయాన్ని కాంగ్రెస్‌ నాయకులు గుర్తించాలన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ తనకు దైవసమానమని పోచంపల్లి పేర్కొన్నారు. కేసీఆర్‌ ఆశీస్సులు, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రోత్సాహం, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్‌, ఎంపీ కల్వకుంట్ల కవితలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వరంగల్‌ ఉమ్మడి జిల్లా అభివృద్ధికి ఇంతకాలం తనకు తోచిన మేరకు సేవ చేశానని, రేపు ఎ మ్మెల్సీ అయ్యాక, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి జిల్లా అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇస్తూ స్థానిక ప్రజాప్రతినిధులందరూ పార్టీలకు అతీతంగా తనకు ఆశీర్వదించాలని కోరారు. కాగా, అంతకు ముందు భద్రకాళి దేవాలయంలో పోచంపల్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎంపీలు బండా ప్రకాశ్‌, దయాకర్‌, ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్‌, చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేశ్‌, కార్పొరేషన్ల చైర్మన్లు వాసుదేవరెడ్డి, లింగంపల్లి కిషన్‌రావు, సుధారాణి, కుడా చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి, వరంగల్‌ నగర మేయర్‌ ప్రకాశ్‌రావు, పలువురు కార్పొరేటర్లతో కలిసి తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్‌ జయశంకర్‌, కాళోజీ, తెలంగాణ అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...